NTPC Recruitment: ఎన్టీపీసీలో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ… నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం..
NTPC Recruitment: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్‌మెంట్ మేనేమెంట్) పోస్టులను భర్తీ చేయనుంది...
NTPC Recruitment: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్టీపీసీ అసిస్టెంట్ ఆఫీసర్ (ఎన్విరాన్‌మెంట్ మేనేమెంట్) పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగంకు చెందిన అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ డిగ్రీ (ఎన్విరాన్‌మెంట్)/ గ్రాడ్యుయేషన్‌తో పాటు ఫుల్ టైం పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎమ్మెస్సీ/ ఎంటెక్ (ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్/ ఎన్విరాన్‌మెంట్ సైన్స్/ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 20-05-2022న మొదలవుతుండగా, చివరి తేదీగా 03-06-2022ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..