- Telugu News Photo Gallery Sara tendulkar to anushka sharma here ses ipl 2022s most glamourous fans in photos in telugu
IPL 2022: సారా, అనుష్క, ధనశ్రీ.. ఐపీఎల్‌లో అందాల భామల సందడి మాములుగా లేదుగా..
IPL 2022 తుది దశకు చేరుకుంది. మే 29 IPL 15 ఫైనల్ జరుగుతుంది.ఈక్రమంలో ఆటగాళ్లతో పాటు వారి సతీమణులు స్టేడియంలో సందడి చేస్తున్నారు. అనుష్కా శర్మ, ధనశ్రీ వర్మ, నటాషా స్టాంకోవిక్ పాండ్యా, దీపికా పల్లికల్ తమ జట్లను ప్రోత్సహిస్తున్నారు.
Updated on: May 19, 2022 | 8:17 AM

IPL 2022: సారా టెండూల్కర్, అనుష్కా శర్మ, ధనశ్రీ వర్మ, నటాషా స్టాంవిక్.. ఇలా ఈ సారి ఐపీఎల్‌లో చాలామంది అందాల తారలు సందడి చేస్తున్నారు.

నటాషా స్టాంకోవిక్: ఈసారి ఐపీఎల్ కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ టైటాన్స్ ఆడే ప్రతి మ్యాచ్ గ్యాలరీలోనూ కనిపిస్తుంది.

సారా టెండూల్కర్ : భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ మెంటార్. అంతేకాకుండా సచిన్ తనయుడు అర్జున్ కూడా ముంబై జట్టులో ఉన్నాడు. ఈక్రమంలో సచిన్ గారాల పట్టి సారా టెండూల్కర్ కూడా ముంబైకు మద్దతు నిస్తోంది. స్టేడియంలో సందడి చేస్తోంది.

ధనశ్రీ వర్మ: భర్త యుజువేంద్ర చాహల్ రాజస్థాన్ రాయల్స్‌లో చేరిన రోజు నుంచి ధన్‌శ్రీ వర్మ పింక్ ఆర్మీకి అభిమానిగా మారిపోయింది. రాజస్థాన్ ఆడే దాదాపు అన్ని మ్యాచ్‌లలోనూ దర్శనమిస్తోంది.

అనుష్క శర్మ , దీపికా పల్లికల్:RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ తన భర్తతో పాటు ఆర్సీబీకి మద్దతు నిస్తూ సందడి చేస్తోంది. ఇక బెంగళూరు ఫినిషర్ దినేష్ కార్తీక్ భార్య, భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కూడా ఈ ఐపీఎల్‌లో మెరుస్తోంది.

ప్రీతి జింటా: పంజాబ్ కింగ్స్ జట్టును దగ్గరుండి ప్రోత్సహిస్తోందీ బాలీవుడ్ ముద్దుగుమ్మ. గ్యాలరీల్లో నుంచి అభిమానులను ఉత్సాహ పరుస్తోంది.




