CM Jagan: ‘ఒక్క మంచి స్కీమ్ లేదు.. అన్నీ స్కామ్‌లే’.. సామాజిక సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున
ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో మమేకం అవడమే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఇవాళ ఎమ్మిగనూరు, మండపేట నియోజకవర్గాల సాధికార యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగింది.
ఏపీలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో మమేకం అవడమే లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు వైసీపీ ప్రజాప్రతినిధులు. ఇవాళ ఎమ్మిగనూరు, మండపేట నియోజకవర్గాల సాధికార యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా.. ఎద్దుల మార్కెట్ నుండి సోమప్ప సర్కిల్ మీదుగా వైయస్ఆర్ సర్కిల్‌కు వరకు బైక్ ర్యాలీ చేశారు వైసీపీ నేతలు.
ఆ తర్వాత ఎమ్మిగనూరు బస్టాండ్ ఎదుట సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ జరిగింది. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీలు గురుమూర్తి, గోరంట్ల మాధవ్‌తోపాటు పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారని చెప్పారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు పాలనలో ఒక్క మంచి స్కీమ్ లేదు.. అన్నీ స్కామ్‌లే అని విమర్శించారు.
కోనసీమ జిల్లా మండపేటలో ఎమ్మెల్సీ తీట త్రిమూర్తులు ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. తాపేశ్వరంలో వైసీపీ నేతల మీడియా సమావేశం తర్వాత మండపేటలోని పూలే విగ్రహం నుంచి కలువ పువ్వు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బస్సు యాత్ర బహిరంగ సభకు మంత్రి జోగి రమేష్, ఎంపీలు పిల్లి సుభాస్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణతోపాటు పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. దేశంలోనే సామాజిక న్యాయం, ధర్మం పాటించిన ఏకైక నేత సీఎం జగన్ అన్నారు మంత్రి జోగి రమేష్.
ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. సామాజిక సాధికార యాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తోంది వైసీపీ. బస్సు యాత్ర ద్వారా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ఏపీలో మళ్లీ అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఒకవైపు సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమఘ్నమైతే.. ఇటు పార్టీ నేతలు ప్రజల్లో వెళ్లి పార్టీని బలపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..