AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అలజడి.. అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Covid sub-variant JN 1: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్‌ కేసులు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్షించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Covid-19: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా అలజడి.. అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Dec 22, 2023 | 7:52 PM

Share

Covid sub-variant JN 1: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మళ్లీ అలజడి రేపుతోంది. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కొత్తవేరియంట్‌ కేసులు నమోదవుతుండగా.. ఆంధ్రప్రదేశ్ లోనూ కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ కొత్త వేరియంట్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్షించారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ వేరియంట్‌ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు చెప్పారు. ఆస్పత్రిలో చేరే పరిస్థితులు లేకుండానే రికవరీ అవుతున్నారని వివరించారు. అయితే, JN‌–1కు వేగంగా విస్తరించే లక్షణం ఉందని తెలిపారు. ప్రభుత్వ పరంగా ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ఇన్‌ఫ్రాను సిద్ధంచేస్తున్నామని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. అత్యంత బలంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను, విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్ధను ముందస్తు చర్యలకోసం అలర్ట్‌ చేయాలన్నారు. కొత్త వేరియంట్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన చర్యలపై విలేజ్‌ క్లినిక్స్‌ స్టాఫ్‌కు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కొవిడ్ నియంత్రణకు తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సీఎం ఈ సందర్భంగా సూచించారు.

ముందస్తుగా ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, డి-టైప్ సిలిండర్లు, 56,741 ఆక్సిజన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేసి, పాజిటివ్ వచ్చిన శాంపిళ్లను విజయవాడ జీనోమ్ ల్యాబ్‌లో పరిశీలించనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్, ఆస్పత్రుల్లో పర్సనల్ కేర్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇదిలాఉంటే.. ఏలూరు జిల్లాలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యుడికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. కొత్త వేరియంట్‌ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అతని శాంపిల్స్ ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపారు.. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తిరుపతి టీటీడీ కౌంటర్లలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో టీటీడీ అప్రమత్తమై కౌంటర్ల దగ్గర కోవిడ్ జాగ్రత్తలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటర్ల దగ్గర నో మాస్క్ నో ఎంట్రీ బోర్డులు పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..