VV Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జేడీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ.. అజెండా ఇదే

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో సంచలనం. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.' జై భారత్.నేషనల్' పేరుతో పార్టీని ప్రకటించిన జేడీ జాతీయ జెండా రంగులతో తన ఫొటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు

VV Lakshminarayana: ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం.. జేడీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ.. అజెండా ఇదే
Vv Lakshminarayana
Follow us
Basha Shek

|

Updated on: Dec 22, 2023 | 9:03 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో సంచలనం. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.’ జై భారత్.నేషనల్’ పేరుతో పార్టీని ప్రకటించిన జేడీ జాతీయ జెండా రంగులతో తన ఫొటో ఉన్న పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడం కోసం తమ పార్టీ పుట్టిందని పేర్కొన్నారు.’ సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేద్కర్ చెప్పారు. ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నా. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నాం. మాది ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ. నిరుద్యోగం ప్రధాన సమస్య. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడ్డం లేదు. నిరుద్యోగం పెరగడానికి ప్రత్యేక హోదా రాకపోవడమే కారణం. ప్రత్యేక హోదా వద్దు.. ప్యాకేజే ముద్దంటున్నారు కొందరు. మరికొందరు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. కానీ మెడలు వంగలేదు. ప్రత్యేక హోదా తేవడానికే జై భారత్ నేషనల్ పార్టీ పుట్టింది. మేం ఎవ్వరికీ తలవంచం.. సాగిలపడం.వాళ్లు తిన్నారని వీళ్లు.. వీళ్లూ తిన్నారని వాళ్లు అంటున్నారు. వాళ్లూ.. వీళ్లూ తిన్నారని సభల్లో ప్రకటించిన వాళ్లు మద్దతిస్తున్నారు. అభివృద్ధితో అవసరాలు తీరుస్తాం. గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశాను. అన్ని వర్గాలను కలిశాను.. అభిప్రాయాలు తీసుకున్నాను. రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలూ విఫలం అయ్యాయి. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు జై భారత్ నేషనల్ పార్టీ పుట్టుకొచ్చింది’ అని జేడీ లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించారు.

జేడీ లక్ష్మీ నారాయాణ కొత్త పార్టీ.. వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..