Tirupati Gangamma Jatara: వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి రోజా..
తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా ఐదో రోజు ఆదివారం మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు స్త్రీ వేషధారణలో గంగమ్మ జాతరకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర వైభవంగా సాగుతోంది. జాతరలో భాగంగా ఐదో రోజు ఆదివారం మాతంగి రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పురుషులు స్త్రీ వేషధారణలో గంగమ్మ జాతరకు వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మకు మంత్రి ఆర్కే రోజా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి రోజా సారెతో ఊరేగింపుగా గంగమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అయితే, ఆలయం వద్ద మంత్రి రోజా దంపతులకు ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో.. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. గంగమ్మ తల్లికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సారె సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ మంత్రి రోజా పేర్కొన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన తాను తిరుపతి గంగమ్మ తల్లిని స్కూల్ డేస్ నుంచి దర్శించుకుంటున్నానన్నారు.
గతంతో పోల్చుకుంటే.. ఇప్పుడు ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ఈ విషయంలో తన గురువైన భూమన కరుణాకర్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ తెలిపారు. దేశమంతటా గంగమ్మ తల్లి మహిమలు తెలిసేలా సీఎం జగన్ ను గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారని మంత్రి రోజా కొనియాడారు.




మరిన్ని ఏపీ వార్తల కోసం..
