Andhra Pradesh: పెన్షనర్‌కు అరుదైన గౌరవం.. వృద్దురాలి కాళ్లు కడిగిన మంత్రి..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వృద్దులు, దివ్యాంగుల కాళ్ళు కడిగి పెన్షన్ సొమ్మును పళ్లెంలో పెట్టి అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెన్షన్‌దారులకు పాదాభివందనం చేసి కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు తన సేవా దృక్పదంను మరోసారి చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మంచం పట్టి ఉన్న పితాని సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్‌కు మంత్రి తొలి పెన్షన్ అందజేశారు.
ఏలూరు జూలై 01: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలైంది. వృద్దులు, దివ్యాంగుల కాళ్ళు కడిగి పెన్షన్ సొమ్మును పళ్లెంలో పెట్టి అందించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పెన్షన్‌దారులకు పాదాభివందనం చేసి కాళ్లు కడిగిన మంత్రి నిమ్మల రామానాయుడు తన సేవా దృక్పదంను మరోసారి చాటుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో మంచం పట్టి ఉన్న పితాని సూర్యనారాయణ అనే లారీ డ్రైవర్‌కు మంత్రి తొలి పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల స్వయంగా సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళను కడిగి పాదాలకు నమస్కరించారు. అనంతరం పెన్షన్ అందజేశారు. అలాగే ఇదే గ్రామంలోని పెదపాటి భాగ్యలక్ష్మి ఇంటికి కూడా మంత్రి నిమ్మల వెళ్లి ఆమె కాళ్ళను కడిగి నమస్కరించి పెన్షన్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారిగా కాకుండా ఒకేసారి పెన్షన్ సొమ్మును పెంచి తన మానవత్వాన్ని చాటుకున్నారని అన్నారు.రాష్ట్రంలో వయస్సు పైబడిన వృద్దులు, వికలాంగులు కుటుంబ సభ్యులు ఆదరణ కరువై అనేక చీత్కరాలకు గురయ్యేవారన్నారు. అంతేకాకా కుటుంబ సభ్యులు వయస్సుపై బడిన వారిని పోషించడానికి తమకు భారంగా ఉన్నారని ఇంటి నుండి బయటకు వెలేసేవారని చెప్పారు.
ఇలా వికలాంగులకు భారం కాకుండా చిత్కారాలకు గురవ్వకుండా వారికి ప్రభుత్వం తరుపున భరోసా కల్పించాలని స్వర్గీయ నందమూరి తారక రామారావు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ పధకాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగిస్తూ దశల వారీగాపెంచుతూ వచ్చారన్నారు. సాధారణంగా పింఛను పొందే వయస్సు 65 సంవత్సరాలుగా ఉంది. కానీ ఇటీవలే భారత ప్రభుత్వం ఈ వయస్సును 60 యేళ్లకు తగ్గించిందన్నారు. ఇక వితంతువులు, వికలాంగులు లేదా ఏదైనా ప్రత్యేక కారణల వల్ల తక్కువ వయస్సు ఉన్న వారికి కూడా పెన్షన్ ఇస్తోంది కేంద్రప్రభుత్వం అని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం పెంచిన పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ పెన్షన్ డబ్బులు అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. సచివాలయ సిబ్బంది స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మొత్తం 65 లక్షల 18 వేల మందికిపైగా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు. వీరిలో 90 శాతం మందికి ఒకటో తేదీనే పెన్షన్ అందించాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఒకటో తేదీ పింఛను అందని వారికి 2వ తేదీన కచ్చితంగా అందచేయాలనీ అధికారులకు చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..