‘టీడీపీ రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్’.. చంద్రబాబు ప్రచార తీరుపై అంబటి ఫైర్..
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇరుపార్టీలు ఎన్నికల ప్రచారజోరును పెంచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడే తీరును ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఇరుపార్టీలు ఎన్నికల ప్రచారజోరును పెంచాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడే తీరును ఖండించారు. చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పక్కన ఉన్న ఆ ముగ్గురు ఎవరు అని రఘురామ కృష్ణం రాజును ఉద్దేశించి సెటైర్లు వేశారు. గతంలో వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు టీడీపీ తరఫున మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు సిగ్గులేదని కీలక వ్యాఖ్యలు చేశారు. లావు కృష్ణ దేవరాయలు ఫ్యాను గుర్తుపై గెలిచి సైకిల్ ఎక్కారన్నారు. అలాగే జంగా కృష్ణమూర్తికి గతంలో వైఎస్ఆర్ టికెట్ ఇస్తే ఎన్నికల్లో నిలబడ్డారని గుర్తు చేశారు. తాము వదిలేసిన వ్యక్తులకు టీడీపీ, జనసేన, బీజేపీలు టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు పార్టీలో పోటీ చేసేందుకు సరైన నేతలు లేరని విమర్శించారు.
చంద్రబాబు ఎన్నికల రోడ్ షోలు, సభలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయన్నారు. చిన్న సందుల్లో పెట్టినా జనం రావడంలేదని ఎద్దేవా చేశారు. దీనిని బట్టే టీడీపీ, చంద్రబాబు పరిస్థితి ఏంటో అర్థమవుతోందన్నారు. సీఎం జగన్ ను విమర్శించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు అంబటి రాంబాబు. ఓట్ల కోసం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని చుకలు అంటించారు. తన పార్టీ అభ్యర్థుల పేర్లు కూడా చంద్రబాబుకు గుర్తులేవన్నారు. సోంత పార్టీ నేతలే చంద్రబాబును తిడుతున్నారని.. తాను చంద్రబాబు, పవన్‌లను విమర్శించానే తప్ప తిట్టలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అంబటి. పొత్తు పెట్టుకోవడం సమాధి కట్టడమే బాబు పని అని కౌంటర్ వేశారు. ఈ విషయాన్ని కన్నా లక్ష్మీ నారాయణ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు. ఎవరెన్ని విధాలుగా కక్ష్యసాధింపు చర్యలు చేపట్టినప్పటికీ 2024లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేషస్పందన వస్తోందని తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








