AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: టీడీపీలో రఘురామకృష్ణంరాజు తుఫాను.. రోజుకో ప్రకటన, పూటకో ట్విస్టు!

ఏపీ పాలిటిక్స్‌లో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తోంది. ఆయన వచ్చి ఎవరి సీటుకు ఎసరు పెడతారో అన్న టెన్షన్‌ టీడీపీ నేతల్లో ఉంది. ఫిబ్రవరిలో టీడీపీ, జనసేన మీటింగ్‌లో పాల్గొన్న దగ్గర నుంచి.. నిన్నటి వరకు ఆయన చేసిన ప్రతీ అడుగు.. ప్రతీ ప్రకటన ఎంతో మందిని కలవరానికి గురిచేసింది.

Andhra Pradesh: టీడీపీలో రఘురామకృష్ణంరాజు తుఫాను.. రోజుకో ప్రకటన, పూటకో ట్విస్టు!
Raghurama Krishnam Raju
Balaraju Goud
|

Updated on: Apr 07, 2024 | 12:12 PM

Share

ఏపీ పాలిటిక్స్‌లో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా నడుస్తోంది. ఆయన వచ్చి ఎవరి సీటుకు ఎసరు పెడతారో అన్న టెన్షన్‌ టీడీపీ నేతల్లో ఉంది. ఫిబ్రవరిలో టీడీపీ, జనసేన మీటింగ్‌లో పాల్గొన్న దగ్గర నుంచి.. నిన్నటి వరకు ఆయన చేసిన ప్రతీ అడుగు.. ప్రతీ ప్రకటన ఎంతో మందిని కలవరానికి గురిచేసింది.

హోల్‌ RRR ఎపిసోడ్‌లో తొలి ఘట్టం ఇది. నరసాపురం నాదే.. అక్కడి నుంచి పోటీ చేసిది నేనే అని ప్రకటించేశారు. అది కూడా చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో. అంతా అనుకున్నట్లుగానే నరసాపురం సీటు కూటమిలో బీజేపీకి దక్కింది. దీంతో RRR ఆ పార్టీలో చేరి బీఫామ్‌ తీసుకోవడమే నెక్ట్స్ అని అనుకున్నారు. కాని జరిగింది వేరు. రఘురామకు రెడ్‌ సిగ్నల్‌ వేసింది కమలం పార్టీ. కొత్తగా ఎవర్నీ చేర్చుకుని టికట్‌ ఇవ్వాల్సిన పనిలేదని అధిష్టానం. ఏపీ బీజేపీ నేతలకు తేల్చి చెప్పడంతో నరసాపురం సీటును RRRకు కాదని.. శ్రీనివాస వర్మకు దక్కింది. దీంతో రఘురామకృష్ణరాజులో ఆగ్రహం కట్టం తెంచుకుంది. బీజేపీ అధినాయకత్వంపై విరుచుకుపడి.. తర్వాత తేరుకున్నారు. ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తే..

RRR ఏలూరు నుంచి పోటీ చేస్తారని ముమ్మర ప్రచారం సాగింది. అక్కడ నుంచి ఎంపీగా బరిలో దిగాలని చూశారు. దీంతో అక్కడి టీడీపీ నేతల్లో టెన్షన్‌ పట్టుకుంది. నర్సాపురం సీటు దక్కక.. ఏలూరు వస్తే తమ పరిస్థితి ఏంటని లోకల్‌ నేతలు తలలు పట్టుకున్నారు. కాని క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌లో ఏలూరు టికెట్‌ను బీసీలకు కేటాయించడంతో టీడీపీ నేత మహేష్‌ యాదవ్‌ పేరు ఖరారయింది. దీంతో ఏలూరు ఎపిసోడ్‌ ముగిసింది. ఇక్కడ కట్‌ చేస్తే..

రఘురామ ఎపిసోడ్‌లో ఇది ముఖ్యమైన ఘట్టం. ఏ పార్టీ కూడా చేర్చుకోకపోవడం.. అసలు ఎక్కడి నుంచి బరిలోకి దిగాలో తెలియకపోవడంతో RRRలో ఫ్రస్ట్రేషన్‌ పీక్స్‌కు చేరింది. ఏలూరు వద్దనుకున్న రఘురామ.. తమ సామాజికవర్గ నేత గెలుస్తూ వస్తున్న ఉండి నుంచి బరిలోకి దిగితే కచ్చితంగా విక్టరీ తనదేనని భావించారు. ఉండి సీట్‌పై కన్నేసిన RRR.. అక్కడి నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే అనౌన్స్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరిన ఆయన.. అధినేత చంద్రబాబును ఒప్పించారు కూడా. ఇప్పటికే శివరామరాజు వర్గంతో ఇబ్బంది పడుతున్న మంతెన రామరాజు.. RRR ప్రకటనతో టెన్షన్‌కు గురయ్యారు. దీంతో మంతెన వర్గీయులు తిరుగుబావుటా ఎగురవేశారు. చంద్రబాబు సమక్షంలోనే రామరాజు టికెట్‌ మార్చొద్దని తెగేసి చెప్పడంతో.. RRR వెనక్కి తగ్గారు. కట్‌ చేస్తే..

ఈ ఒక్క ప్రకటనతో.. విజయనగరంలో టీడీపీ నేతలకు టెన్షన్‌ పట్టుకుంది. నరసాపురం అయిపోయింది.. ఏలూరు అయిపోయింది.. ఉండి ఎపిసోడ్‌ ముగిసింది. ఇప్పుడు తమ సీట్‌పై పడ్డాడేంటని.. కలిశెట్టి అప్పల నాయుడు వర్గం టెన్షన్‌కు గురైంది. అయితే రఘురామ ఎప్పుడు ఏం ప్రకటిస్తారో.. ఎక్కడి నుంచి పోటీ అంటారో అని తెలియక ఇటు కోస్తాంధ్ర.. అటు ఉత్తరాంధ్ర నేతలకు ఒకటే టెన్షన్‌. ఇక్కడ కట్‌ చేస్తే..

మళ్లీ నరసాపురం నుంచే రఘురామ పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఏలూరు సీటుని బీజేపీకి కేటాయించి, నరసాపురం టీడీపీ తీసుకుని RRRకు బీఫామ్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కట్‌ చేస్తే.. మళ్లీ సీన్‌ 1 తెరపైకి వచ్చింది. నరసాపురం అభ్యర్థి శ్రీనివాస వర్మ, ఏలూరు అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌కు టెన్షన్‌ పట్టుకుంది. ఇలా టీడీపీలో తుఫాను సృష్టిస్తున్నారు రఘురామకృష్ణంరాజు. ఆయన పోటీ చేయడం పక్కా.. ఎక్కడి నుంచి అనేది తెలియదు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరు సీటు త్యాగం చేయడం తప్పదనిపిస్తుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…