AP Weather: మండే ఎండల్లో కూల్ న్యూస్.. 3 రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు

ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఏపీలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండే ఎండలతో ఇబ్బంది పడుతున్న ఏపీప్రజలకు చల్లనివార్త చెప్పింది వాతావరణ శాఖ. మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది

AP Weather: మండే ఎండల్లో కూల్ న్యూస్.. 3 రోజులు ఆ ప్రాంతాల్లో వర్షాలు
Andhra Weather
Follow us

|

Updated on: Apr 07, 2024 | 2:50 PM

సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ మొదటివారంలోనే ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. 10 దాటాక బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది.  ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఆంధ్రాలో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. శనివారం 7 జిల్లాలలో దాదాపుగా 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా, నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు వెదర్ డిపార్ట్‌మెంట్ కూల్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 7 (ఆదివారం) నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.  రాయలసీమ, కోస్తాంధ్రలో గల కొన్ని జిల్లాలలో ఈ 3 రోజుల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా అక్కడక్కడ ఉష్ణోగ్రతలు నుంచి కాస్త ఊరట తక్కుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. గత పదిరోజులుగా మాడు పగిలే ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి.. ఈ వార్త కాస్త రిలీఫ్ కలిగించిందని చెప్పొచ్చు.

మరోవైపు ఎండలు మండుతున్న వేళ ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకూ అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలని చెబతున్నారు. మంచినీళ్లు మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ.. హైడ్రేటెడ్‌గా ఉండాలని చెబుతున్నారు. ఇక తప్పక బయటకు వెళ్లేవారు గొడుగులు వినియోగించాలని,  క్యాప్‌లు ధరించాలని.. అధికారులు సూచనలు ఇష్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…