AP News: పైకి చూసి గడ్డి వాము అనుకునేరు.. లోపలకెళ్లి చూడగా మైండ్ బ్లాంక్.!
వచ్చేది ఎన్నికల సీజన్ కదా.. అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ వర్గాలకు చేతినిండా పనే..! తనిఖీల్లో మద్యం, డబ్బు పట్టుబడుతూ ఉంటుంది. వాహనాల్లో పెట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో బయటపడుతుంది. కానీ అనకాపల్లి జిల్లాలో పోలీసులకు వచ్చిన ఓ చిన్న అనుమానం..

వచ్చేది ఎన్నికల సీజన్ కదా.. అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ వర్గాలకు చేతినిండా పనే..! తనిఖీల్లో మద్యం, డబ్బు పట్టుబడుతూ ఉంటుంది. వాహనాల్లో పెట్టుకొని ఒక ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ పోలీసుల తనిఖీల్లో బయటపడుతుంది. కానీ అనకాపల్లి జిల్లాలో పోలీసులకు వచ్చిన ఓ చిన్న అనుమానం.. పొలం వరకు తీసుకెళ్లింది. అక్కడ ఉన్న గడ్డివామును తనిఖీ చేయించింది. కట్ చేస్తే.. అంతా షాక్ అయ్యారు. గడ్డివామును ఓ గోడౌన్ లా వాడేసాడు. ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఆ బాటిళ్లు..!
అనకాపల్లి జిల్లా పోలీసులకు ఓ కీలక సమాచారం అందింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మద్యం భారీగా చేతులు మారుతున్నట్టు తెలిసింది. దీంతో మునగపాక పోలీసులు అలర్ట్ అయ్యారు. యాదగిరి పాలెం ప్రాంతంలో పోలీసులు మాటు వేసి.. బైక్ పై వస్తున్న ముగ్గురుని ఆపి తనిఖీలు చేశారు. వారి వద్ద 240 రాయల్ బ్లూ మార్ట్ విస్కీ బాటిల్లను గుర్తించారు పోలీసులు. వారిని పట్టుకుని కూపి లాగితే.. లింకు ఎలమంచిలి మండలం సోమలింగపాలెనికి తగిలింది. నిందితులు చెప్పిన సమాచారం ప్రకారం.. అక్కడ ఓ రైతు కల్లాలో భారీగా మద్యం ఉన్నట్టు తెలిసింది. కళ్ళల్లో అంత భారీ మద్యం ఉంటుందా అన్న సందేహం పోలీసులకు ఒకానొక సమయంలో వ్యక్తం అయింది. అక్కడకు వెళ్లి గడ్డి వాములో వెరిఫై చేసేసరికి భారీగా రాయల్ బ్లూ మాల్ట్ విస్కి డంప్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. 39వేల 168 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామాన్నారు డీఎస్పీ సత్యనారాయణ.
కర్రీ వెంకటస్వామి, కర్రీ ధర్మ తేజ, దినేష్ కుమార్ లను అరెస్టు చేశారు. పట్టుబడిన మద్యం విలువ 49 లక్షలు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. గోవా నుంచి మద్యం వచ్చినట్టు గుర్తించామని.. భారీగా మద్యం పట్టుబడంతో.. ఎన్నికల సీజన్ నేపథ్యంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు ఎస్పీ మురళీకృష్ణ. చూశారు కదా వీళ్ళ ఐడియా..! ఏకంగా గడ్డివామునే మద్యం కోసం గొడౌన్ లా మార్చేశారు. వేలకొద్దీ బాటిలను అందులో డంప్ చేసేసారు. మూడో కంటికి తెలియకుండా దందా సాగించేస్తున్నారు. ఇంతకీ మున్నెన్నడూ లేని విధంగా అంత భారీ స్థాయిలో వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు ఒకే చోట పట్టుబడడం అనుమానాలకు భావిస్తోంది. ఎస్.. నిందితులను కటకటలోకి నెట్టిన పోలీసులు.. ఆయా యాంగిల్స్ లో కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు.
