AP Polycet 2024: ఏపీ పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదు!
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 దరఖాస్తు గడువును పొడిగిస్తూ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ప్రకటించింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ప్రకటనలో పేర్కొన్నారు. కాగా పాలీ సెట్ దరఖాస్తు గడువు శుక్రవారం (ఏప్రిల్ 5)తో ముగిసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు..

అమరావతి, ఏప్రిల్ 7: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 దరఖాస్తు గడువును పొడిగిస్తూ స్టేట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) ప్రకటించింది. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి ప్రకటనలో పేర్కొన్నారు. కాగా పాలీ సెట్ దరఖాస్తు గడువు శుక్రవారం (ఏప్రిల్ 5)తో ముగిసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. అయితే ప్రవేశ పరీక్ష తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని, ఏప్రిల్ 27వ తేదీన యధాతథంగా పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో పలు కాలేజీల్లో సాంకేతిక విద్యాశాఖ ఇస్తున్న ఉచిత శిక్షణకు మరింత ఆదరణ వస్తోందని, అందుకు అనుగుణంగా ఈ నెల 8వ తేదీ నుంచి మరో బ్యాచ్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాగరాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
AP SET 2024 Hall Tickets: ఏప్రిల్ 19 నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లు విడుదల… 30 సబ్జెక్టుల్లో పరీక్ష
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీ సెట్)-2024 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు త్వరలో విడుదల కానున్నాయి. విడుదల అనంతరం ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ చేట ఏపీ సెట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్‌కు, పేపర్ 2 పరీక్ష 30 సబ్జెక్టుల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టుకు నిర్వహిస్తారు. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ఇక పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మూడు గంటల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




