ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం.. అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండలో విషాదం చోటుచేసుకుంది. గంగాధర్ అనే 46 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఖర్జూరం తింటుండగా, విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక మరణించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శ్రీ సత్య సాయి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గొంతులో ఖర్జూరం ఇరుక్కుని 46ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. పెనుకొండ పట్టణానికి చెందిన గంగాధర్ అనే వ్యక్తి ఇంట్లో ఖర్జూర పళ్ళు తింటున్నాడు. అలా ఖర్జూర పండ్లు తింటుండగా పొరపాటున విత్తనం గొంతులోకి వెళ్ళింది.. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కోవడంతో గంగాధర్ కు ఊపిరాడలేదు… దీంతో వెంటనే కుటుంబ సభ్యులు గంగాధర్‌ను పెనుకొండలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం తీసుకువెళ్లాలని డాక్టర్లు సూచించారు…. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కుని ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు అనంతపురం తీసుకెళుతుండగా మార్గ మధ్యలోనే అతడు మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పెనుకొండ పట్టణంలో గంగాధర్ కార్ ట్రావెల్స్ నడిపిస్తున్నాడు. గొంతులో ఖర్జూర విత్తనం ఇరుక్కుని ఊపిరి ఆడక గంగాధర్ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ఇటీవల గొంతు సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి ఇంట్లో ఖర్జూరం తింటుండగా విత్తనం పొరపాటున ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. దీంతో ఊపిరాడలేదు. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .




