Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం..! ఇక దంచికొట్టుడే.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
Latest Weather Report: వాన కాలంలో పడాల్సిన వర్షాలు ఇక ఊపందుకున్నాయా అన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఆ విధంగా ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టులో పడాల్సిన వర్షపాతం సాధారణంగా కంటే తక్కువగా పడడంతో పాటు.. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. ఒకేసారి ఆవర్తనాలకు తోడు.. బంగాళాఖాతంలో అల్పపీడనం
Latest Weather Report: వాన కాలంలో పడాల్సిన వర్షాలు ఇక ఊపందుకున్నాయా అన్నట్టు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఆ విధంగా ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగస్టులో పడాల్సిన వర్షపాతం సాధారణంగా కంటే తక్కువగా పడడంతో పాటు.. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం రికార్డ్ అయింది. ఒకేసారి ఆవర్తనాలకు తోడు.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలాచోట్ల వర్షపాతం రికార్డు అవుతోంది. రెండు రోజుల్లో వర్షాలు మరింత పెరిగే ఆస్కారం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అంతగా ప్రభావం చూపెట్టలేదు. రైనీ సీజన్లో కీలకమైన ఆగస్టులోనూ అడపదడప వర్షాలే కురిశాయి. వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు దంచి కొట్టాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. గత కొన్నేళ్లలో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదైనట్టు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించినప్పటికీ.. బలపడేందుకు అనుకూల పరిస్థితిలో లేకపోవడంతో ఆగస్టు అంతా వేడిగా సాగింది. చాలాచోట్ల వర్షాకాలంలో ఉండే ఉష్ణోగ్రతలకు సాధారణకు మించి నమోదయ్యాయి.
నెల రోజులపాటు ఊరించి ఉసురు అనిపించిన వర్షాలు.. ఇప్పుడు పుష్కలంగా కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు సెప్టెంబర్ మొదటి వారంతో ఈ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే చాలా చోట్ల వర్షాలు ప్రారంభమయ్యాయి. కొన్నిచోట్ల ఉదయం ఎండ ఉన్నప్పటికీ సాయంత్రానికి మేఘాలు కమ్ముకొని వాతావరణం చల్లబడి వర్షాలు పడుతున్నాయి.
ఒకేసారి అన్నీ..
నెల రోజులుగా హిమాలయాల్లోనే ఉన్న రుతుపవన ద్రోణి కాస్త.. ఇప్పుడు దక్షిణం వైపుకు మల్లుతోంది. దీనికి తోడు విదర్భ నుంచి దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. అలాగే.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రుతుపవనాలు బలాన్ని పుంజుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశలున్నాయి. వీటి ప్రభావంతో ఈనెల ఐదవ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఇక.. మూడు రోజులపాటు కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణలోనూ ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు ఐఎండి ప్రకటించింది. కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
వరుణుడి కోసం..
వర్షాలు సాధారణం కంటే తక్కువ స్థాయిలో నమోదైన నేపథ్యంలో.. రుతుపవన ద్రోని బలాన్ని పుంజుకోవడం శుభపరిణామం. ఎందుకంటే రైతులకు కూడా వర్షం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపు నెలరోజులుగా వర్ణుడు కరుణించాలని ఆకాశం వైపు చూస్తున్నారు. ఇప్పుడు పరిస్థితిలో అనుకూలంగా మారడంతో.. ఏ అవాంతరాలు లేకుండా అవసరం మేరకు వర్షాలు కురవాలని ప్రార్థిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..