Hyderabad: పుష్ప స్టయిల్‌లో స్మగ్లింగ్.. విజయనగరం టు మహారాష్ట్ర.. వయా మహబూబ్‌నగర్.. చివరకు..
Drugs seized in Hyderabad: పుష్ప సినిమా స్టయిల్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పట్టుకుంది. హైవేపై కాకుండా వేరే దారిలో ప్రయాణం చేస్తూ విజయనగరం నుంచి గుంటూరు, మాచర్ల, మల్లేపల్లి, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది.
Drugs seized in Hyderabad: విజయనగరం టు మహారాష్ట్ర.. వయా.. తెలంగాణ.. పుష్ప సినిమా స్టయిల్‌లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పట్టుకుంది. హైవేపై కాకుండా వేరే దారిలో ప్రయాణం చేస్తూ విజయనగరం నుంచి గుంటూరు, మాచర్ల, మల్లేపల్లి, దేవరకొండ, కల్వకుర్తి, జడ్చర్ల మీదుగా మహారాష్ట్రకు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సిబ్బంది. లారీ చూడటానికి ఖాళీగా కనపడుతుందని, ముందు ఎస్కార్ట్ లో కారు వెళ్తూ ఉంటుందని పోలీస్ చెకింగ్ ఉంది లేదా అన్నది కారులో ఉన్న వాళ్లు చెక్ చేస్తు వెళ్తారని ఎస్పీ సునీతా రెడ్డి తెలిపారు. నిందితుల దగ్గరి నుంచి కోటి రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సునీతా రెడ్డి వెల్లడించారు. నిందితులంతా మహారాష్ట్రలోని ఉస్మనాబాద్ కు చెందిన వారని తెలిపారు.. ప్రధాన నిందితుడు హసన్ పరారీలో ఉన్నట్టు తెలిపారు ఎస్పీ. కారులో ఉన్న ముగ్గురు, లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టైన వారిని కస్టడీలోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
కాగా, ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనుక పెద్ద హస్తమే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున డ్రగ్స్ రవాణా చేసేందుకు ఎవరెవరు సహకరించారు.. దీనివెనుక ఎంత మంది ఉన్నారు.. అనే వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




#TSNAB in a Joint Operation with #NCB nabbed (5)person seized 208kgs Ganja,(2)vehicles in the limits of Nakkalabanda Thanda,Mahaboobnagar Dist,TS. Total worth Rs 1Crore.@TelanganaDGP @CVAnandIPS @narcoticsbureau @hydcitypolice @TelanganaCOPs @RachakondaCop #drugfreetelangana pic.twitter.com/x54N08r4tV
— Telangana Anti Narcotics Bureau (@TS_NAB) September 3, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
