TSPSC Exam dates: సెప్టెంబర్ నెలంతా రాత పరీక్షలు నిర్వహించనున్న టీఎస్‌పీఎస్సీ.. గ్రూప్1 ఫలితాలు అప్పుడే..
సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తికానుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ పలు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తోంది. ఆగస్టు నెలలో..

హైదరాబాద్, సెప్టెంబర్ 3: సర్కార్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా పూర్తికానుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ పలు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఆన్‌లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహిస్తోంది. ఆగస్టు నెలలో నిర్వహించిన అన్ని పరీక్షలు సీబీటీ విధానంలోనే నిర్వహించింది. ఇక సెప్టెంబర్ నెలంతా 35 రకాల నియామక పరీక్షలను సీబీఆర్‌టీ విధానంలో నిర్వహించనుంది.
దీంతో సెప్టెంబరు నెల మొత్తం రాత పరీక్షలు, ఆన్సర్ కీల వెల్లడి, ఫలితాల వెల్లడి వంటి పనుల్లో బిజీగా మారింది. ఆయా పరీక్షలకు సంబంధించి న్యాయ వివాదం పూర్తయితే సెప్టెంబరు సెప్టెంబర్ నెలలో గానీ, అక్టోబరులో గానీ ఫలితాలు వెల్లడించి.. అనంతరం మెరిట్ లిస్టులను ప్రకటించే అవకాశాలున్నట్లు సమాచరం. ఇక గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి మరింత సమయం పట్టేలా ఉంది. మెయిన్ పరీక్షల షెడ్యూల్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే గ్రూప్1పై కోర్టులో రెండు న్యాయవివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై స్పష్టత వస్తేగానీ తదుపరి ప్రక్రియ ప్రారంభం కాదు.
పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు, ఫిజికల్ డైరెక్టర్లు, జూనియర్ లెక్చరర్ పోస్టులకు నియామక పరీక్షలు సెప్టెంబర్ 4 నుంచి 29వ తేదీ వరకు జరగుతాయి. ఇప్పటికే 16 ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి రాతపరీక్షలు కమిషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం మొత్తం 35 పరీక్షల నిర్వహణకు సీబీఆర్‌టీ విధానంలో జరపడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసింది. అసిస్టెంట్ ఇంజినీర్ల పోస్టులకు అక్టోబరు నెలలో పరీక్ష జరగనుంది. ఈ నెల మూడో వారంలో ఎనిమిదింటి తుది ‘కీ’లు విడుదల చేయనుంది. గ్రూప్ 4 ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు అందిన తర్వాత 15 రోజుల్లో తుది ఆన్సర్ ‘కీ’ ప్రకటించనుంది. గ్రూప్-2 పరీక్ష నవంబరులో జరుగుతాయి. గ్రూప్-3తో రాతపరీక్ష తేదీలు ఇంకా ఖరారు చేయలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




