Telangana MHSRB Jobs: తెలంగాణలో 1931 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..

తెలంగాణలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1931 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఇచ్చిన 1,666 పొస్టులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అదనంగా 265 పోస్టులను ఆరోగ్య శాఖ విలీనం చేసింది. దీంతో పోస్టుల సంఖ్య 1,931కు చేరింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే..

Telangana MHSRB Jobs: తెలంగాణలో 1931 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Telangana
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 03, 2023 | 8:15 PM

తెలంగాణలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం పరిధిలో 1931 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత ఇచ్చిన 1,666 పొస్టులకు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో అదనంగా 265 పోస్టులను ఆరోగ్య శాఖ విలీనం చేసింది. దీంతో పోస్టుల సంఖ్య 1,931కు చేరింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అధికారిక వెబ్‌సైట్  ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 19వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అవకాశం ఇచ్చారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర నర్సెస్‌ లేదా మిడ్‌వైఫ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన ఏదైనా విద్యా సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రైనింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా

ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రైనింగ్‌ కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి. ఈ పోస్టులకు మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 2023 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 49 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌/ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్న అభ్యర్ధులకు మూడేళ్ల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు సమయంలో అప్లికేషన్ ఫీజు కింద రూ.500తోపాటు అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు కింద రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష ఆధారంగా నియామక ప్రక్రియ ఉంటుంది. హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040 నుంచి రూ.92,050 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.