BPCL Recruitment: భారత్‌ పెట్రోలియంలో అప్రెంటిస్‌ పోస్టులు.. నెలకు రూ. 25 వేలు జీతం

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో చేసిన...

BPCL Recruitment: భారత్‌ పెట్రోలియంలో అప్రెంటిస్‌ పోస్టులు.. నెలకు రూ. 25 వేలు జీతం
BPCL JOBS
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 03, 2023 | 7:16 AM

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలోని అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. పలు విభాగాల్లో ఉన్న మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌ పోస్టులే అయినప్పటికే రూ. 25 వేల వరకు వేతనం చెల్లించడం విశేషం. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను అప్రెంటిస్‌ (సవరణ) చట్టం, 1973 ప్రకారం అర్హత కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో చేసిన స్పెషలైజేషన్‌ ఆధారంగా అప్రెంటిస్‌ పోస్టుకు ఎంపిక చేస్తారు.

ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. అయితే నిబంధనల ఆధారంగా వయసు విషయంలో వయో సడలింపు వర్తిస్తుంది. ఇందుకోసం పూర్తి నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుందని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇవి కూడా చదవండి

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 వరకు స్టైఫండ్‌ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ధరఖాస్తుల స్వీకరణకు 15-09-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ
జనవరి 1 నుంచి అమలు చేయాలని భావించిన ప్రభుత్వం.. కానీ