AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Milk: ఆవు పాలు ఉచితం.. అడిగితే ఆవును కూడా ఉచితంగా ఇచ్చేస్తారు.. ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే..

Free Milk: ఇంటిలో ఒక ఆవు ఉన్నట్లైతే, పిల్లల్ని బ్రతికించుకోవచ్చునని పురాతన కాలం నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. అంటే ఆవు ఎంత..

Free Milk: ఆవు పాలు ఉచితం.. అడిగితే ఆవును కూడా ఉచితంగా ఇచ్చేస్తారు.. ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే..
Free Milk
Shiva Prajapati
|

Updated on: Jul 04, 2021 | 4:06 PM

Share

Free Milk: ఇంటిలో ఒక ఆవు ఉన్నట్లైతే, పిల్లల్ని బ్రతికించుకోవచ్చునని పురాతన కాలం నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. అంటే ఆవు ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ కారణంగానే ఆవు సహజంగానే ఒక తల్లి లాంటిదిగా భావించబడింది. అందుకే మన భారతదేశంలో గోవు దేవతా స్వరూపముగా భావిస్తారు. ఆవు పాలలో మనకు అత్యంత మేలు చేసే బంగారపు తత్వం ఇమిడి ఉంది. అందుకే సాధువులు, ఋషులు, మునులు ఆవుపాలనే సేవిస్తారు. యజ్ఞానికి, హోమానికి ఆవుపాలను వాడుతారు. దేవాలయాల్లో పూజకు, అభిషేకానికి ఆవుపాలు వాడుతారు. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఆవు పాలు నేడు కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది. కానీ, కర్నూలు జిల్లాలో ఓ గ్రామంలో ఆవు పాలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా దూరం నుంచి వచ్చిన వారికి ఆవు నే ఉచితంగా ఇస్తానంటున్నాడు రైతు. ఆ రైతు ఎవరు..? ఎందుకు అలా చేస్తున్నాడో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి.

కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామంలో ఆవుల శీను అనే రైతు ఆవులను ఉచితంగా ఇస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. శ్రీశైలం నీటి ముంపు గ్రామమైన కొత్త బిజినవేముల గ్రామంలో నివసించే శ్రీనివాసులు సుమారు ఐదు వందల ఆవులను పోశిస్తూ జీవనం సాగిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఆవులను అవసరమైన వారికి ఉచితంగా పంపిస్తున్నాడు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా పేదవారికి కుటుంబానికి అవసరమైన పోషణ కోసం, దేవాలయలకు, ఇతరులకు ఆవులను ఉచితంగా ఇస్తూ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. స్వచ్ఛమైన ఆవు పాల కోసం స్వగ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తుంటారు. అలా వచ్చిన వారికి కాదనకుండా, రూపాయి తీసుకోకుండా ఆవు పాలను ఇచ్చే పంపుతాడు శీను. ఇలా ఆవు పాలు అవసరమైన వారికి పాలు ఇస్తుండడంతో శీను కాస్తా.. ఆవుల శీను గా గుర్తించబడ్డాడు.

ఈ ఆవుల శీను.. ఆవు పాలను మాత్రమే కాదు.. అవసరమన్న వారికి ఆవును కూడా ఉచితంగా ఇచ్చేస్తున్నారు. అయితే, కర్నూలు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ఆవులను ఉచితంగా ఇస్తాడు శీను. తన దగ్గర ఉన్న ఆవులలో ఏదైనా ఆవు, దూడకు జన్మనిస్తే.. ఆవుతో పాటు లేగ దూడను కూడా పంపుతాడు. ఆవు మూడు నెలలపాటు పాలు ఇస్తుందని, ఆ తర్వాత పాలు తగ్గిపోవడంతో ఆవు దూడను తిరిగి తనకే తీసుకొచ్చి ఇవ్వాలని అవును తీసుకుని పోతున్న వారికి కచ్చితంగా చెబుతాడు. ఇలా శీను దగ్గర నుంచి ఈ చుట్టుప్రక్కల వారు చాలానే అవులు తీసుకునిపోయినట్లు తెలుస్తోంది. ఒక ఆవు పాలు చాలక పోతే అవసరమైతే మళ్లీ మరో అవును కూడా ఇస్తాడు శీను. బిజినేముల గ్రామంలో తన దగ్గర ఉన్న దాదాపు 500 ఆవులను నిలుపుకునేందుకు, గడ్డి వేసుకునేందుకు సరైన సౌకర్యం లేదని.. రెవెన్యూ అధికారులను స్థలం కేటాయిస్తే ఇంకా మరి కొందరికి ఆవు పాలు, ఆవులను అందిస్తానని శీను చెబుతున్నాడు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయానికి పాలిచ్చే ఆవును పంపించానని, అధికారులు దయతలిచి తనకు రెండెకరాల భూమి కేటాయిస్తే ఆవులను మేపుకుంటూ ఎక్కువమందికి తన వంతు సహాయం చేస్తానని తెలియజేశారు. శీను ఎలాంటి లాభాపేక్షలేకుండా పాలను, ఆవులను ఇవ్వడం హర్షించదగ్గ విషయం అని శీను నుంచి లబ్దిపొందిన వారు కొనియాడుతున్నారు.

Also read:

Dimple Hayathi: బాలీవుడ్‏లోకి డింపుల్ హయాతి ?… వరుస ఆఫర్లతో ‘ఖిలాడి’ హీరోయిన్ బిజీ..

అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్‌ ఇతడే.. వీడియో రిలీజ్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే

Mehreen Pirzada : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లు డిలీట్ చేసిన మెహరీన్.. అమ్మడి బ్రేకప్ కు కారణం అదేనా..