YSRCP: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి..
YSRCP: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ ఎంటర్ అవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మాజీ చైర్మన్, వైసీపీ నేత వై.వి సుబ్బారెడ్డి ఆసక్తికర..
YSRCP: ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ ఎంటర్ అవడంపై తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ మాజీ చైర్మన్, వైసీపీ నేత వై.వి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నాడు ఇదే అంశంపై టీవీ9తో మాట్లాడిన ఆయన.. రెండేళ్ళుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేక పోయానన్న బాధ తనలో ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా తాను పదవులు ఆశించడం లేదన్న వై.వి సుబ్బారెడ్డి.. సీఎం జగన్ ఆదేశిస్తే మాత్రం మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. ఇదే అభిప్రాయాన్ని సీఎం జగన్‌కు కూడా చెప్పానని సుబ్బారెడ్డి వెల్లడించారు. రాజ్యసభ సీటు ఇచ్చినా, మరే ఇతర పదవి ఇచ్చినా అధినేత జగన్ అభీష్టం మేరకే పనిచేస్తా అని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలని ఉందని తన మనుసులోని మాటను బయటపెట్టారు సుబ్బారెడ్డి. అయితే, టీటీడీ పదవిలోనే కొనసాగిస్తారా?.. లేక మరే ఇతర పదవి అయినా ఇస్తారా?.. అన్నది తమ పార్టీ అదినేత, సీఎం జగన్ నిర్ణయానికే వదిలేశానని చెప్పారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత.. టీటీడీ చైర్మన్‌గా వై.వి సుబ్బారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన పదవీ కాలం ముగియడంతో.. వై.వి సుబ్బారెడ్డి ఇప్పుడు మాజీగా మారిపోయారు. ప్రస్తుతం టీటీడీ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. మరి వై.వి సుబ్బారెడ్డిని అదే స్థానంలో కొనసాగిస్తారా? లేక మరేదైనా పదవి కట్టబెడతారా? అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.
Also read:
Sajjala Ramakrishna Reddy: “ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం”