Karivena Satram : శ్రీశైల పుణ్యక్షేత్రంలో కరివేన సత్రానికి వైభవంగా భూమిపూజా కార్యక్రమం
భవిష్యత్తు కార్యచరణలో భాగంగా యాదాద్రి, అరుణాచలంలో కూడా స్థలసేకరణ, అన్నదాన సత్రం ఏర్పాటుకు కమిటీ నిర్ణయం..
Karivena satram : కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కరివేన సత్రానికి ఇవాళ భూమి పూజ జరిగింది. మెగా గ్రూప్ ఆఫ్ కంపెనీ డైరెక్టర్ పద్రీప్, EO కే. ఎస్ రామారావు కలిసి భూమి పూజ చేశారు. పాత భవనం నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు పూర్తి కావడంతో, ఆ భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ భవనాన్ని కూల్చి వేసి దాని స్థానంలో కొత్త భవనానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు.
ఆధ్యాత్మిక వేత్త కామరాజు నరేంద్ర ఆధ్వర్యంలో బ్రహ్మణ సేవాసత్ర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల త్రిపురాంతకంలో చక్రా సిమెంట్ భవనంలో కొత్తగా కరివేన సత్ర సేవలు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తు కార్యచరణలో భాగంగా యాదాద్రి, అరుణాచలంలో కూడా స్థలసేకరణ, అన్నదాన సత్రం ఏర్పాటుకు కమిటీ నిర్ణయం తీసుకుంది.
Read also : ‘ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు’