‘ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు’

'ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరు'
Kcr

ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం.. ఆ దిశగా ప్రయాణిస్తున్నం.. ఫలితాలు కనబడుతున్నయి..

Venkata Narayana

|

Jul 04, 2021 | 4:20 PM

KCR Sircilla Speech : ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్‌ ప్రయాణాన్ని ఎవరూ కూడా ఆపలేరని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. “ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నం.. ఆ దిశగా ప్రయాణిస్తున్నం.. ఫలితాలు కనబడుతున్నయి.” అని సీఎం అన్నారు. ఈ మాట మీకు సిరిసిల్ల వేదిక మీద నుంచి చెబుతున్నా అని చెప్పిన సీఎం.. ఆ ఫలితాలు మన ముందరే కాదు యావత్‌ ప్రపంచం ముందు కూడా ఉన్నవని ముఖ్యమంత్రి అన్నారు. “మనకు అపనమ్మకాలు ఎక్కువ. కానీ లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి, వాక్‌శుద్ధి ఈ మూడు తోడైతే ఏదైనా వందశాతం అయితది” అని సీఎం అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఉదాహారణ అని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సీఎం.. ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటు కావడం జరిగిందన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్‌ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సీఎం మీకు ఏది చేతకాదు అనే వాదనను ఖండించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

దానికి నిదర్శనమే ప్రస్తుతం మన కళ్ల ముందున్న కలెక్టరేట్ అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణాలకు డిజైన్‌ చేసింది మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్‌ ఉషారెడ్డి అని వాటిని కడుతుంది తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సీఎం పేర్కొన్నారు.

Read also  : అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్‌ ఇతడే.. వీడియో రిలీజ్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu