అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్‌ ఇతడే.. వీడియో రిలీజ్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే

అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్‌ ఇతడే.. వీడియో రిలీజ్ చేసిన మంగళగిరి ఎమ్మెల్యే
Mla Rk

భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన బ్రహ్మానందరెడ్డి బెదిరించి దళితుల భూములు తీసుకున్నారంటూ దానికి సంబంధించి ఓ సంచలన వీడియో..

Venkata Narayana

|

Jul 04, 2021 | 3:56 PM

Alla Ramakrishna : సీఆర్డీఏ పరిధిలో దళితులను చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ బెదిరించి భూములు లాక్కున్నారని అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ(ఆర్కే). భూమిపుత్ర రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు చెందిన బ్రహ్మానందరెడ్డి బెదిరించి దళితుల భూములు తీసుకున్నారంటూ దానికి సంబంధించి ఓ సంచలన వీడియో ఇవాళ ఆర్కే విడుదల చేశారు. అమరావతి స్కామ్‌ కోసమే IAS సాంబశివరావును ఇక్కడికి తీసుకొచ్చారని అన్నారు ఎమ్మెల్యే ఆళ్ల. అసైన్డ్‌ భూములు తీసుకోవడం చట్ట వ్యతిరేకమని ఎందుకు అప్పటి కలెక్టర్లు చెప్పలేదని ఆర్కే ప్రశ్నించారు.

చట్టానికి సవరణలు చేసి మరీ శ్రీధర్‌ను చంద్రబాబు నియమించారని ఆర్కే చెప్పారు. అమరావతి భూకుంభకోణం వెనుక మాస్టర్‌మైండ్‌ రిటైర్డ్‌ IAS అధికారి సాంబశివరావు అని ఆర్కే తెలిపారు. ఇతనే రాజధానిలో భూముల వివరాలు సేకరించి.. అమరావతి స్కామ్‌కు స్కెచ్‌ వేశారని ఆర్కే ఆరోపించారు. గుంటూరు కలెక్టర్లుగా పనిచేసిన కాంతిలాల్‌ దండే, కోన శశిధర్‌తో పాటు చెరుకూరి శ్రీధర్‌ తో కలిసి భూముల రికార్డులు మాయం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే ఆళ్ల. ప్రస్తుతం తుళ్లూరు పరిధిలో ఒక్క రికార్డు లేకుండా చేశారని అన్నారు.

అమరావతి ల్యాండ్‌ స్కామ్‌పై పూర్తి స్థాయి విచారణ జరగాలని అన్నారు ఎమ్మెల్యే ఆర్కే. ఈ కుంభకోణంలో పాత్ర ఉన్న ప్రతి అధికారి, ప్రజాప్రతినిధిని విచారించాలని కోరారు. దళితుల భూములను లాక్కోవడంలో కీలక పాత్ర పోషించిన భూమిపుత్ర బ్రహ్మానందారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read also : రాజన్న సిరి సిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన.. కలెక్టరేట్‌ భవనం సహా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu