Krishna Water: కృష్ణా జలాల విషయంలో తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తోంది.. హైకోర్టు మెట్లెక్కిన కృష్ణా జిల్లా రైతు..
Krishna Water Issue: కృష్ణా జలాలపై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ వాటా కింద వచ్చే జలాల్లో
Krishna Water Issue: కృష్ణా జలాలపై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. జల విద్యుదుత్పత్తిని ఆపేదీ లేదని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేపడుతోందని పేర్కొంటోంది. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలంగాణ నీరు తొడుకుంటుందంటూ తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆయన పిటిషన్‌లో వెల్లడించారు.
తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పనిచేయాలంటూ.. గత నెల 28న తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవోను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన పిటిషన్‌లో వెల్లడించారు. కాగా.. రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపిన నాటి నుంచి కృష్ణా జలాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై నివేదిక సమర్పించాలని కేంద్రం కృష్ణా బోర్డును ఆదేశించింది. కాగా ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల నాయకులు కృష్ణా జలాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఈ విషయం కాస్తా ఇరు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: