జమ్మూలో మళ్ళీ కనిపించిన ఎగిరే వస్తువు..డ్రోన్ కాదన్న భారత జవాన్లు.. మరింత అప్రమత్తం

జమ్మూలో మళ్ళీ కనిపించిన ఎగిరే వస్తువు..డ్రోన్ కాదన్న భారత జవాన్లు.. మరింత అప్రమత్తం
Flying Object Seen On Jammu

జమ్మూ లోని సాంబా జిల్లా బీర్ పూర్ లో శనివారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఎగురుతున్న వస్తువునొకదానిని భారత జవాన్లు చూశారు. వెంటనే గాలింపు జరపగా వారికి ఆ తరువాత ఏ వస్తువూ కనబడలేదు.

Umakanth Rao

| Edited By: Phani CH

Jul 04, 2021 | 10:45 AM

జమ్మూ లోని సాంబా జిల్లా బీర్ పూర్ లో శనివారం రాత్రి 8.45 గంటల ప్రాంతంలో ఎగురుతున్న వస్తువునొకదానిని భారత జవాన్లు చూశారు. వెంటనే గాలింపు జరపగా వారికి ఆ తరువాత ఏ వస్తువూ కనబడలేదు. అది డ్రోన్ కాకపోయి ఉండవచ్చునని సాంబా పోలీసులు అంటున్నప్పటికీ.. భారత దళాలు మాత్రం తమ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలనన్నింటినీ తీసుకుంటున్నారు. జూన్ 27 న కేవలం 5 నిముషాల వ్యవధిలో రెండు సందర్భాల్లో డ్రోన్లు ఎగిరాయి. భారత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ [పై దాడి జరిపాయి. ఆ దాడిలో ఇద్దరు వైమానిక దళ ఉద్యోగులు గాయపడ్డారు. శుక్రవారం తెల్లవారు జామున 4.25 గంటల ప్రాంతంలో ఆర్నియా సెక్టార్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ డ్రోన్ చాలా కిందుగా ఎగురుతూ కనిపించింది. వరుసగా నాలుగైదు రోజుల పాటు జమ్మూ లోని కుంజ్ వాని, కలుచౌక్, మీరాన్ సాహిబ్, ఏరియాల్లో ఇవి కనిపించినట్టు సైనిక వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ లోని ఉగ్రవాదులే వీటిని ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోందని పోలీసు అధికారులు అంటున్నారు.

చౌకగా, సులభంగా లభించే డ్రోన్లను వారు పేలుడు పదార్థాలను జారవిడవడానికి ఉపయోగించుకుంటున్నారు. బహుశా చైనా నుంచి తెప్పించుకున్న వీటిని వారు వాడుతున్నట్టు తెలుస్తోంది. ఐరాసలో ఇండియా ఈ విషయాన్ని లేవనెత్తి తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఈ విధమైన దాడులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా డ్రోన్ల దాడి విషయంలో పాకిస్థాన్ కు ఇండియా ఇంతవరకు తన నిరసన తెలియజేయలేదు. దీన్ని ప్రభుత్వం తేలికగా తీసుకుంటున్నదన్న విమర్శలు వినవస్తున్నాయి. మరోవైపు జమ్మూ లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జామర్లు, యాంటీ డ్రోన్ సిస్టం వ్యవస్థలను అధికారులు ఏర్పాటు చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి: కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి ..? బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై విచారణకు సుప్రీంకోర్టు అనుమతి

Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu