Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.

Aamir khan: బాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరైన అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌లు తమ దాంపత్య జీవితానికి ఫుల్ స్టాప్‌ పెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్‌ కపుల్ ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే ఆ వార్త వైరల్‌గా మారింది...

Aamir khan: అమీర్‌ ఖాన్‌, కిరణ్‌ రావ్‌ విడిపోవడానికి కారణం ఆ హీరోయినేనా..? నెట్టింట వైరల్‌గా మారిన హ్యాష్‌ ట్యాగ్‌.
Aamir Khan
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2021 | 10:39 AM

Aamir khan: బాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకరైన అమీర్‌ ఖాన్‌ తన భార్య కిరణ్‌ రావ్‌లు తమ దాంపత్య జీవితానికి ఫుల్ స్టాప్‌ పెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్టార్‌ కపుల్ ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే ఆ వార్త వైరల్‌గా మారింది. ముఖ్యంగా అమీర్‌ తీసుకున్న ఈ నిర్ణయంపై నెట్టింట మిశ్రమ స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే ఈ జంట విడిపోవడానికి దంగల్‌ ఫేమ్‌ ఫాతిమా సనా షేక్‌ కారణమనే ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. అమీర్‌ఖాన్‌ జీవితంలోకి సనా షేక్‌ రావడం వల్లే ఈ జంట విడిపోయిందని నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఏకంగా ఫాతిమా సనా షేక్‌ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా కొందరు నెటిజన్లు గతంలో అమీర్‌ఖాన్‌ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘అమీర్‌ నువ్వు భావ స్వేచ్ఛ ప్రకటన గురించి ఆందోళన వ్యక్తం చేశావో గుర్తుందా? నీ భార్య దేశం విడిచి వెళ్లాలని ఉందని చేసిన కామెంట్లు గుర్తున్నాయా?.. ఇప్పుడు మా భావ ప్రకటన స్వేచ్ఛను ప్రదర్శిస్తున్నాం. ఈ విషయంలో నువ్వు, నీ భార్య, నీ గర్ల్ ఫ్రెండ్‌ ఎవరూ కూడా మమ్మల్ని అడ్డుకోలేరు’అంటూ పోస్టింగ్‌లు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ట్రోలింగ్‌పై అమీర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే.. 2016లో వచ్చిన దంగల్ చిత్రంలో ఫాతిమా అమీర్‌ఖాన్‌కు కూతురిగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత వచ్చిన థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌లో అమీర్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే అమీర్‌ ఖాన్‌కు, ఫాతిమాకు మధ్య ఏదో ఉందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.

Also Read: Akhil Akkineni : అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నిర్మాతలు

Viral Video: తనను ఆహారంగా తిందామనుకున్న కప్పకు చుక్కలు చూపించిన కందిరీగ.. వైరల్ వీడియో

Viral News: సైనస్ చికిత్స కోసం డాక్టర్ వద్దకు వెళ్లిన ఓ యువతికి షాక్.. 22 ఏళ్ల నుంచి చెవిలో చిక్కుకున్న వస్తువు..