Akhil Akkineni : అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నిర్మాతలు

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం పడలేదు.

Akhil Akkineni : అఖిల్ సినిమాలో మెగాస్టార్.. భారీ రెమ్యునరేషన్ ఇవ్వనున్న నిర్మాతలు
Akhil
Follow us

|

Updated on: Jul 04, 2021 | 10:27 AM

Akhil Akkineni : అక్కినేని యంగ్ హీరో అఖిల్ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం పడలేదు. చేసిన మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. ఇప్పుడు అఖిల్ ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే పెట్టుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరక్కేక్కిన ఈ సినిమా షూటింగ్ క్లామాక్స్ లో ఉంది. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గ నటిస్తుంది. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో అఖిల్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్ ఉందనీ .. అలాగే ఈ సినిమాలో సీనియర్ హీరో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మమ్ముటి తో చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపిందట… సినిమా చేయడానికి మమ్ముట్టి సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కోసం ఆయన తీసుకునే పారితోషికం 3 కోట్లు అని అంటున్నారు.

మమ్ముటి తెలుగు ప్రేక్షకులు సుపరిచితులే.. అయ్యన నటించిన చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఇటీవల దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు అఖిల్ సినిమా కోసం ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారు. ఆయన పాత్ర సినిమా సినిమాకే హైలైట్ గా ఉంటుందట అందుకనే అంత మొత్తంలో అమౌంట్ ఇవ్వడానికి  సిద్దమయ్యారట.   ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య కథానాయికగా పరిచయమవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Junior NTR : తారక్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్స్.. మెగాస్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

Prabhas’s Adi Purush: తిరిగి సెట్స్ పైకి ఆదిపురుష్.. డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..

Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ… ఆ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ ..?