Junior NTR : తారక్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్స్.. మెగాస్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమాలో కొమురం భీం గా కనిపించనున్నాడు యంగ్ టైగర్.

Junior NTR : తారక్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్స్.. మెగాస్టార్ డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 04, 2021 | 9:56 AM

Junior NTR : ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు తారక్. ఈ సినిమాలో కొమురం భీం గా కనిపించనున్నాడు యంగ్ టైగర్. కొమురం భీమ్ లుక్ కోసం తారక్ చాలా కష్టపడ్డాడు. ఇటీవల తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ చేస్తున్న నాలుగో సినిమా ఇది. ఈ సినిమాలో తారక్ తోపాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు. అయితే ముందుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు. కానీ ఏమైందో ఏమో కానీ లైన్ లోకి కొరటాల శివ వచ్చారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల తో సినిమా చేస్తున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమా ఇది. ఈ సినిమా కోసం కొరటాల శివ భారీప్లాన్ వేస్తున్నారు. ఎన్టీఆర్ 30 ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే ఈ సినిమాలో ఇతరభాషల స్టార్స్ ను తీసుకోనున్నారట.  జనతా గ్యారేజ్ సినిమా లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను తీసుకు వచ్చిన కొరటాల శివ ఈ సినిమాకు గాను బాలీవుడ్ స్టార్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది.సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు బోమన్ ఇరానీని కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేయడం జరిగిందట. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న కొరటాల ఆ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Prabhas’s Adi Purush: తిరిగి సెట్స్ పైకి ఆదిపురుష్.. డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..

Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ… ఆ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ ..?