Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ… ఆ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ ..?

Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ... ఆ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ ..?
Vijay Devarakonda

ఓవర్ నైట్ లో స్టార్ హీరో రేంజ్ తెచ్చుకోవడం అంత సులువు కాదు.. కానీ అది ఈ యంగ్ హీరోకు సాధ్యమైంది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండను టాలీవుడ్ క్రేజీ హీరోను చేసింది.

Rajeev Rayala

|

Jul 04, 2021 | 7:57 AM

vijay devarakonda: ఓవర్ నైట్ లో స్టార్ హీరో రేంజ్ తెచ్చుకోవడం అంత సులువు కాదు.. కానీ అది ఈ యంగ్ హీరోకు సాధ్యమైంది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండను టాలీవుడ్ క్రేజీ హీరోను చేసింది. భారీ సంఖ్యలో అభిమానులను తెచ్చి పెట్టింది. సందీప్ వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత విజయ్ సినిమాలపై అభిమానుల్లో అంచనాలు పెరగడం మొదలైంది. విజయ్ సినిమా వస్తుందంటే అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.. ప్రస్తుతం ఈ కుర్ర హీరో డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. లైగర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది, లైగర్ తో విజయ్ బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత విజయ్ ఓ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతుంది.

గబ్బర్ సింగ్ సినిమాతో తన రేంజ్ ఏంటో చూపించిన హరీష్ శంకర్ తో విజయ్ దేవరకొండ సినిమా ఉండనుందని టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ అప్పట్లో ఓ సినిమాకి కమిట్మెంట్ ఇచ్చాడట. అయితే ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్ చేయాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఇప్పుడు పవన్ అదే రేంజ్ హిట్ ఇవ్వాలని హరీష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే విజయ్ తో హరీష్ శంకర్ సినిమా ఉండకపోవచ్చు అని కూడా టాక్ వినిపిస్తుంది. మరి త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kiran Rao: కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. ఆమె ఆస్తుల విలువ తెలుసా..?

Rashmika Mandanna: అలవాటులో పొరపాటు.. మాస్కు పెట్టుకోవడం మరిచిపోయిన రష్మిక. వెంటనే తప్పును గుర్తించి.

Naveen Polishetty: ఏకంగా మూడు ప్రాజెక్ట్‏లను లైన్‏లో పెట్టిన యంగ్ హీరో.. టాప్ నిర్మాణ సంస్థల బ్యానర్లలో నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడా ?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu