Naveen Polishetty: ఏకంగా మూడు ప్రాజెక్ట్‏లను లైన్‏లో పెట్టిన యంగ్ హీరో.. టాప్ నిర్మాణ సంస్థల బ్యానర్లలో నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడా ?

నవీన్ పోలిశెట్టి.. "ఏజెంట్ సాయి శ్రీనివాస" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇటీవల "జాతిరత్నాలు" సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

Naveen Polishetty: ఏకంగా మూడు ప్రాజెక్ట్‏లను లైన్‏లో పెట్టిన యంగ్ హీరో.. టాప్ నిర్మాణ సంస్థల బ్యానర్లలో నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడా ?
Naveen Polishetty
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 03, 2021 | 9:56 PM

నవీన్ పోలిశెట్టి.. “ఏజెంట్ సాయి శ్రీనివాస” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత కాస్తా గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఇటీవల “జాతిరత్నాలు” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నవీన్ పోలిశెట్టి తదుపరి ప్రాజెక్ట్స్‏కు సంబంధించి ఎలాంటి అప్‏డేట్ రాలేదు. దీంతో ఈ యంగ్ హీరో నెక్ట్స్ మూవీస్ పై పలు రకాల వార్తలు సోషల్ మీడియా చక్కర్లు కొట్టాయి. తాజాగా నవీన్ పోలిశెట్టి తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై అప్డేట్ ఇచ్చాడు. నవీన్ సినిమాలను… అతని నటనను మెచ్చుకుంటూ ఓ అభిమాని ట్విట్ చేయగా… దీనిపై స్పందిస్తూ.. తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు నవీన్..

“థ్యాంక్యూ సో మచ్. ప్రస్తుతం తదుపరి మూడు సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. నా హ్యాండిల్ లో త్వరలోనే ప్రకటిస్తాను. ఇంకెక్కడ ఏం చదివినా నమ్మకండి. ఆల్బర్ట్ ఐన్ స్టీన్. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ తో కలిసి పనిచేయడం నా కల. మీ కోసం స్టోర్ లో ఉంచిన వాటి గురించి చెప్పడానికి ఎగ్జైటింగ్‏గా ఉన్నాను” అంటూ నవీన్ ట్వీట్ చేశారు. ఇక నవీన్ చెప్పినదాని ప్రకారం.. బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ అంటే.. యూవీ క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, వైజయింతీ మూవీస్ సంస్థలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే యూవీ బ్యానర్ లో హీరోయిన్ అనుష్కతో కలిసి నవీన్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. వయసు వ్యత్యాసం ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగితే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో ఆ మూవీ ఉండబోతుందని.. ఆ చిత్రానికి రారా కృష్ణయ్య డైరెక్టర్ మహేష్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం. అలాగే మహేష్ బాబు ప్రొడక్షన్ లో కూడా నవీన్ ఓ మూవీ చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అలాగే జాతిరత్నాలు మూవీ మేకర్స్ తో కలిసి ఆ సినిమా సిక్వెల్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: మాల్దీవుల నుంచి స్విట్జర్లాండ్ వరకు చూడాలనుకుంటున్నారా ? అయితే కేవలం రూ.75 వేలతో ఈ విదేశాలను సులభంగా చుట్టేయ్యొచ్చు..

మరో వివాదం..బెంగాల్ లో వ్యాక్సిన్ ఇచ్చిన తృణమూల్ కాంగ్రెస్ కౌన్సిలర్.. సీఎం మమతకు తలనొప్పి !

CM KCR District Tour: రేపు రాజన్నసిరిసిల్ల జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్.. రూ. 210 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం