Rashmika Mandanna: అలవాటులో పొరపాటు.. మాస్కు పెట్టుకోవడం మరిచిపోయిన రష్మిక. వెంటనే తప్పును గుర్తించి.

Rashmika Mandanna: ప్రస్తుతం కరోనా మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఒకప్పుడు మాస్కు పెట్టుకునే వారిని వింతగా చూసే వారు కానీ ఇప్పుడు మాస్కులేని వారికి వింతగానే కాదు.. కోపంగా కూడా చూస్తున్నారు. ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు..

Rashmika Mandanna: అలవాటులో పొరపాటు.. మాస్కు పెట్టుకోవడం మరిచిపోయిన రష్మిక. వెంటనే తప్పును గుర్తించి.
Rashmika Mandanna
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 04, 2021 | 7:16 AM

Rashmika Mandanna: ప్రస్తుతం కరోనా మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఒకప్పుడు మాస్కు పెట్టుకునే వారిని వింతగా చూసే వారు కానీ ఇప్పుడు మాస్కులేని వారికి వింతగానే కాదు.. కోపంగా కూడా చూస్తున్నారు. ఇంటి నుంచి బయట అడుగు పెడితే చాలు మాస్కు తప్పనిసరిగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అలవాటులో పొరపాటులా మాస్కు వాడకాన్ని మరిచిపోతుంటాం. తాజాగా నటి రష్మిక మందన్న కూడా ఇలానే పొరపాటు పడింది. ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉన్న ఈ చిన్నది ముంబయికు షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఏదో కార్యక్రమానికి వెళ్లింది. ఆ సమయంలో కారులో నుంచి దిగి ముందుకు నడుస్తూ వెళ్లింది. అయితే.. మాస్కు ధరించడాన్ని మరిచిపోయింది. దీంతో వెంటనే తన పొరపాటును తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ వెనక్కి వెళ్లి కారులో ఉన్న మాస్కును తెచ్చుకుంది. అయితే మాస్కు మరిచిపోయానని రష్మిక పలికించిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనంతటిని ముంబయి మీడియా తమ కెమెరాల్లో బంధించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ వైరల్‌ భయానీ.. ‘రష్మిక మాస్కు ధరించడాన్ని మరిచిపోయింది. తన క్యూట్‌ రియాక్షన్‌ను చూడండి’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. మాస్కు లేకపోవడంతో నోటికి చేతిని అడ్డుపెట్టుకుంటున్న సమయంలో రష్మిక పలికించిన హావభావాలు నిజంగానే క్యూట్‌గా అనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రష్మిక సినిమాల విషయానికొస్తే.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు హిందీలోనూ నటిస్తోంది.

రష్మిక వీడియో..

Also Read: Naveen Polishetty: ఏకంగా మూడు ప్రాజెక్ట్‏లను లైన్‏లో పెట్టిన యంగ్ హీరో.. టాప్ నిర్మాణ సంస్థల బ్యానర్లలో నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడా ?

మాస్క్ పెట్టుకొని ఫోటోకు ఫోజులిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ? చెప్పుకోండి చుద్దాం..

RRR Movie: ట్విట్టర్ వేదికపై ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్.. నెట్టింట ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ సంచలనం.. అసలు మ్యాటరెంటంటే..