Prabhas’s Adi Purush: తిరిగి సెట్స్ పైకి ఆదిపురుష్.. డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..

టాలీవుడ్- బాలీవుడ్ అని లేకుండా అంతా ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్.

Prabhas's Adi Purush: తిరిగి సెట్స్ పైకి ఆదిపురుష్.. డార్లింగ్ ఎంట్రీ ఇచ్చేది అప్పుడేనా..
Prabhas
Follow us

|

Updated on: Jul 04, 2021 | 8:29 AM

Prabhas’s Adi Purush

టాలీవుడ్- బాలీవుడ్ అని లేకుండా అంతా ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. ఆతర్వాత వచ్చిన సాహో సినిమాతో ప్రభాస్ కు బాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. దాంతో ఇప్పుడు ప్రభాస్ అన్ని పాన్ ఇండియా మూవీస్ నే చేస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా చివరిదశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నాడు రెబల్ స్టార్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు డార్లింగ్. కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసాడు. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటితో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓ రౌత్ తో సినిమా చేస్తున్నాడు ప్రభాస్.

రామాయణం ఆధారంగా  ఆదిపురుష్ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని మొదటినుంచి టాక్ వినిపిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ‘ఆదిపురుష్‌’ మోషన్‌ కాప్చర్‌ టెక్నాలజీతో రూపొందుతోంది. కరోనా కారణంగా ఆగిపోయిన సినిమాలన్నీ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతుంది. రాధే శ్యామ్ చివరి షెడ్యూల్ ను పూర్తి చేసి త్వరలోనే ముంబయి కి వెళ్లనున్నారు ప్రభాస్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Deverakonda: దిల్ రాజు బ్యానర్ లో విజయ్ దేవరకొండ… ఆ స్టార్ డైరెక్టర్ తో ప్లాన్ ..?

Kiran Rao: కొత్త జీవితాన్ని ప్రారంభించనున్న అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు.. ఆమె ఆస్తుల విలువ తెలుసా..?

Rashmika Mandanna: అలవాటులో పొరపాటు.. మాస్కు పెట్టుకోవడం మరిచిపోయిన రష్మిక. వెంటనే తప్పును గుర్తించి.