అసదుద్దీన్ ఒవైసీ సవాలును స్వీకరిస్తున్నాం.. 300 సీట్లు గెలుస్తాం…యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన సవాలును తాము స్వీకరిస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

అసదుద్దీన్ ఒవైసీ సవాలును స్వీకరిస్తున్నాం.. 300 సీట్లు గెలుస్తాం...యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..
Up Cm Yogi Adityanath
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jul 04, 2021 | 12:55 PM

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన సవాలును తాము స్వీకరిస్తున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2022 లో జరిగే ఎన్నికల్లో తాము 300 కి పైగా సీట్లను గెలుచుకుంటామని.. మీరో..మేమో తేల్చుకుందామని ఆయన కూడా సవాల్ విసిరారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒవైసీ ఈ దేశ పెద్ద నాయకుడని, ఆయన సవాలును మా పార్టీ కార్యకర్తలు స్వీకరిస్తున్నారని చెప్పారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ అఖండ విజయానికి తమ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, ప్రధాని మోదీ ఓరియెంటెడ్ పాలసీలే కారణమని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.. ఈ ఎన్నికల ఫలితాలే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తాయని ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. కాగా-రానున్న ఎన్నికల్లో యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా చూడాలని ఒవైసీ ఇటీవల ట్వీట్ చేశారు. ఆ ఎన్నికల్లో తమ పార్టీ 100 సీట్లకు పోటీ చేస్తుందని, ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట్ల తమ పార్టీ అభ్యర్థులను నిలబెడతామని ఆయన పేర్కొన్నారు.

యూపీలో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఘన విజయాన్ని సాధించి పెట్టినందుకు యోగి ఆదిత్యనాథ్ ను ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఇందుకు మీ ప్రభుత్వం చేసిన కృషి ఎంతో దోహదం చేసిందన్నారు. మీ పథకాలకు ప్రజల ఆశీస్సులు లభించాయని తమ సందేశాల్లో పేర్కొన్నారు. ఇదే విజయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రతిఫలించాలన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Ponguru Narayana: నెల్లూరులో కనిపించని మాజీ మంత్రి నారాయణ..! అజ్ఞాతం వీడేదెప్పుడో..?

Chiranjeevi Tweet: అంతరిక్షయానం చేయనున్న తొలి తెలుగు మహిళపై ప్రశంసలు కురిపించిన చిరు.. అందరూ గర్వించదగ్గ విషయమంటూ..