Crime News: షాకింగ్… రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 04, 2021 | 12:55 PM

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు అరెస్టు చేశారు . నిందితుడి దగ్గర నుంచి...

Crime News:  షాకింగ్... రూ. 879కోట్లు విలువ చేసే హెరాయిన్ సీజ్
Heroin Seized

Follow us on

అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్​ను మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్​ఐ) అధికారులు అరెస్టు చేశారు . నిందితుడి దగ్గర నుంచి దాదాపు 300 కేజీల హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 879 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఇరాన్​, అఫ్గానిస్తాన్​ నుంచి అక్రమంగా తరలించిన సరుకును.. జిప్సమ్​ స్టోన్​, తాల్కమ్​ పౌడర్​గా అధికారులు గుర్తించారు. ఈ సరుకును సరఫరా చేస్తున్న ప్రబ్​జోత్​ సింగ్ అనే నిందితుడిని రాయ్​గఢ్ దగ్గర్లోని జవహర్​లాల్​ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్​పీటీ) సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు వివరించారు. గతేడాది ఆగస్టులోనూ ఆయుర్వేదిక్ మందుల పేరిట హెరాయిన్ సరఫరా చేస్తున్న కంటైనర్​ను డీఆర్​ఐ బృందాలు గుర్తించాయి. రూ. 1,000 కోట్ల విలువ చేసే హెరాయిన్​ను సీజ్​ చేశాయి. అప్పుడు కూడా ఆ మత్తుపదార్థాలు అఫ్గాన్​ నుంచే సరఫరా అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

ముంబైలో  రూ.300 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

మహారాష్ట్ర ముంబైలో 290 కిలోల హెరాయిన్​ను రెవెన్యూ ఇంటిలిజెన్స్​ డైరెక్టరేట్​(ఆర్​ఐడీ)అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సముద్ర మార్గం ద్వారా విదేశాల నుంచి ముంబైలోని జేఎన్​పీటీ పోర్టుకు మాదకద్రవ్యాలు దిగుమతి అవుతున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు.. తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే భారీగా హెరాయిన్​ పట్టుబడినట్లు వెల్లడించారు. అలాగే జేఎన్​పీటీ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు.

Also Read: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu