Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Assistant Public Prosecutors Posts: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 151..

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్.. 151 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 04, 2021 | 12:18 PM

Assistant Public Prosecutors Posts: తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 151 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఆదివారం నోటిఫికేషన్‌‌ను విడుదల చేసింది. మల్టీ జోన్ పోస్టులను ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరిన్ని వివరాలకు www.tslprb.in లో లాగిన్ కావాలని సూచించింది.

పోస్టుల వివరాలు.. మొత్తం పోస్టులు: 151 మల్టీ జోన్-1లో 68 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌ 27, బీసీ-ఏ 5, బీసీ-బీ 5, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 4, ఈడబ్ల్యూఎస్‌ 7, ఇతరులు 2 ఖాళీలు ఉన్నాయి.) మల్టీ జోన్‌-2లో 83 పోస్టులు ఉన్నాయి. (జనరల్‌ 32, బీసీ-ఏ 7, బీసీ-బీ 7, బీసీ-సీ 1, బీసీ-డీ 5, బీసీ-ఈ 3, ఎస్సీ 12, ఎస్టీ 6, ఈడబ్ల్యూఎస్‌ 8, ఇతరులు 2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.)

అర్హత: ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్‌ పూర్తిచేసి సంబంధిత న్యాయవాద రంగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 2021, జూలై 1 నాటికి 34 ఏళ్ల లోపు వారై ఉండాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండో పేపర్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇది కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ఫీజు: రూ.1500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.750 మరిన్ని వివరాలకు అభ్యర్థులు www.tslprb.in ను సందర్శించాలి.

Also Read:

NIN Recruitment: నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.? దరఖాస్తుల గడువు రేపటితోనే ముగియనుంది..

Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..