Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..

Complaint against Twitter India: మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు ట్విట్టర్

Twitter India: మత విద్వేశాలను రెచ్చగొడుతోంది.. ట్విట్టర్‌పై న్యాయవాది ఫిర్యాదు..
Twitter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 04, 2021 | 11:46 AM

Complaint against Twitter India: మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌కు భారత్ నుంచి ఉచ్చు బిగుస్తోంది. భారత్ తీసుకువచ్చిన ఐటీ సంస్కరణలకు ట్విట్టర్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి కొన్నిరోజులుగా ట్విట్టర్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ట్విట్టర్ ఇండియా మరో సమస్యలో చిక్కుకుంది. ఢిల్లీ సైబర్ సెల్‌లో ట్విట్టర్ ఎండీ మనీష్ మహేశ్వరిపై కేసు నమోదయ్యింది. ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, చర్యలు తీసుకోవాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఆదిత్య సింగ్ దేశ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎథిస్ట్ రిపబ్లిక్ పేరుతో ఉన్న ఒక పోస్టు వివాదాస్పదంగా ఉందని పేర్కొన్నారు. దీనిలో హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్న కార్టున్‌ను షేర్ చేశారని.. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా.. మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని ఆదిత్యా సింగ్ ఆరోపించారు. ఈ యూజర్ చేసిన పోస్టులో ఉన్న అంశం సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆయన ఫిర్యాదులో వెల్లడించారు.
ఆ యూజర్ ఉద్దేశ పూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ పోస్టు పెట్టారని, కానీ ట్విట్టర్ దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని ఆదిత్య సింగ్ ఆరోపించారు. పోలీసులు వెంటనే స్పందించి ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి, ట్విట్టర్ ఇండియాకు చెందిన పబ్లిక్ పాలసీ మేనేజర్ షగుఫ్తా కమ్రాన్‌తో పాటు రిపబ్లిక్ ఎథిస్ట్ వ్యవస్థాపకులు ఆర్మిన్ నవాబీ, సీఈవో సుసైన్ తదితరులపై ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అనంతరం న్యాయవాది ఆదిత్యా సింగ్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ఇండియా సామాజిక బాధ్యతగా ఇటువంటి వివాదాస్పద పోస్టులను తొలగించేందుకు ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. భారత చట్టాలను ఉల్లంఘించేలా ప్రవరిస్తోందని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అయితే.. ఈ కేసుపై ఢిల్లీ పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సమచారం.