వారి కన్ను పడితే బైక్ హాంఫట్… ఇంటి ముందు పార్క్ చేశారంటే ఇక అది మీది కానట్టే..

వారి కన్ను పడితే బైక్ హాంఫట్. ఇంటి ముందు బైక్ పార్క్ చేయాలంటే బయపడేలా చేసిందా గ్యాంగ్.. ఒకవేళ‌ మర్చిపోయి బైక్ ను పార్క్ చేస్తే ఇక‌ మనం దాని గురించి మరిచిపోవాల్సిందే.

వారి కన్ను పడితే బైక్ హాంఫట్... ఇంటి ముందు పార్క్ చేశారంటే ఇక అది మీది కానట్టే..
Bike Thives
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 04, 2021 | 5:36 PM

(రేవన్ రెడ్డి, టీవీ9 తెలుగు, నల్గొండ)

వారి కన్ను పడితే బైక్ హాంఫట్. ఇంటి ముందు బైక్ పార్క్ చేయాలంటే బయపడేలా చేసిందా గ్యాంగ్.. ఒకవేళ‌ మర్చిపోయి బైక్ ను పార్క్ చేస్తే ఇక‌ మనం దాని గురించి మరిచిపోవాల్సిందే. అంతలా రెచ్చిపోయి మరీ చోరీలు చేశారు. కొన్ని రోజుల‌పాటు సూర్యాపేట వాసుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బైక్ దొంగతనాల ముఠా ఆట కట్టించారు పోలీసులు. ఇటు ప్రజల్ని, అటు పోలీసుల్ని‌ ముప్పు తిప్పలు పెడుతున్న ఘరానా దొంగల ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులు గల అంతర్ జిల్లా దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 22 లక్షల విలువ చేసే 40 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా సూర్యాపేట పట్టణంలో బైక్ చోరీలు‌ పెరిగి పోయాయని పోలీసులకు భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టారు. సీసీ ఫుటేజ్ తో పాటు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ‌ చేస్తుండగా ఓ వ్యక్తిపై అనుమానం‌ కలిగి విచారణ చేయగా ఈ తతంగం అంతా బయటకు వచ్చింది.

ఈ గ్యాంగ్ కి చల్లా ప్రభాకర్ అనే వ్యక్తి నాయకుడు. జల్సాలకు అలవాటు పడిన ప్రభాకర్ ఈజీ మనీ కోసం చోరీలు స్టార్ట్ చేశాడు. కొద్ది రోజుల తర్వాత ఎనిమిది మందితో కలిసి ముఠా ఏర్పాటు చేసి దొంగతనాలకు పాల్పడు తున్నారు. ఇలా చోరీ చేసిన వాహనాలను తక్కువ ధరకు అమ్మి సొమ్ము చెసుకుంటున్నారు. నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాల్లో సూర్యాపేటకు చెందినవి 13, కోదాడ 4, ఖమ్మం 5, హైదరాబాద్ 1, నందిగామ 4, హన్మకొండ 1, జగ్గయ్యపేట 6, ఇంకా వివరాలు తెలియనివి 5 వాహనాలు ఉన్నాయి. ప్రధాన నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సూర్యాపేట ఎస్పీ ఆర్. భాస్కరన్ తెలిపారు. మనం ఏదైనా కొనేముందు తక్కువ ధరకు వస్తోందంటే అంటే అందులో ఏదైనా తిరకాసు ఉందని అర్థం.

Also Read: జైలులో మగ ఖైదీలకు చుక్కలు చూపించిన మహిళా అధికారిణి.. మరీ ఇంత దారుణమా..?

భయంకరంగా వేధించే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను పాలో అవ్వండి.. మైగ్రేన్ తగ్గించే బెస్ట్ టిప్స్.