AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Headache Relief Tips: భయంకరంగా వేధించే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. మైగ్రేన్ తగ్గించే బెస్ట్ టిప్స్.

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య తలనొప్పి.. ఉద్యోగంలో పని భారం.. ఇంట్లో సమస్యలతోపాటు..

Headache Relief Tips: భయంకరంగా వేధించే తలనొప్పిని తగ్గించుకోవడానికి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.. మైగ్రేన్  తగ్గించే బెస్ట్ టిప్స్.
Headache
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 5:33 PM

Share

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య తలనొప్పి.. ఉద్యోగంలో పని భారం.. ఇంట్లో సమస్యలతోపాటు.. అనారోగ్య సమస్యల ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య రోజు రోజూకీ పెరుగిపోతుంది. అయితే చాలా మందికి ఈ సమస్య ఇప్పుడు పెనుభూతంగా మారింది. సప్లిమెంట్స్ తీసుకున్నా కొందరిలో ఈ సమస్య మాత్రం తీవ్రంగా బాధిస్తుంటుంది. ఇక చాలా మంది మహిళలలో మైగ్రేన్ సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి.. ఇళ్లలో ఉండే మహిళల్లో ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా వినిపిస్తుంది. అయితే సప్లిమెంట్స్ ద్వారా తలనొప్పి నుంచి తాత్కలికంగా ఉపశమనం లభించిన.. క్రమంగా ఈ సమస్య పెద్దదిగా మారిపోతుంది. ఫలితంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే తలనొప్పి నుంచి విముక్తి పొందవచ్చు అంటున్నారు నిపుణులు అవెంటో తెలుసుకుందామా.

మంచినీరు.. శరీరానికి తగినన్ని నీటిని తీసుకోకపోతే.. డీహైడ్రేషన్ సమస్యతోపాటు.. టాక్సిన్స్ బాడీలో ఉండిపోయి.. మైగ్రేస్ సమస్యను కలిగిస్తాయి. అంతేకాకుండా.. రక్తప్రసరణ కూడా తగ్గుతుంది. మెదడుకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ చేరుకోలేవు. కాబట్టి రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి.

వ్యాయమం.. రోజులో కొద్దిసేపైనా వ్యాయమం చేయాలి. ఇది శరీరానికి పూర్తిగా రక్తప్రసరణ జరిగేలా చేస్తుంది. అంతేకాకుండా.. సహజ నొప్పి నివారిణిగా తోడ్పడే ఎండార్ఫిన్స్ ను కూడా విడుదలచేస్తుంది. బ్రిస్క్ వాక్, యోగా.. వీటిలో ఏది చేసిన తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

నిద్ర.. ఒత్తిడి పెరుగుతున్న కొద్ది నిద్ర శాతం తగ్గుతుంటుంది. ఇది మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంసపూర్తి నిద్ర తలనొప్పికి దారితీస్తుంది. నిద్రకు గంట ముందు గ్యాడ్జెట్లను పక్కన పెట్టాలి. అలాగే రోజూ ఒకే సమయంలో నిద్రపోవాలి.

దీర్ఘశ్వాస.. ఒత్తిడి, ఆందోళన శ్వాసపైనా తద్వారా మానసిక స్థితిపైనా తీవ్ర ప్రభావం చూపుతాయి. అందుకే శరీరానికి తగిన ఆక్సిజన్ అందేలా చూసుకోవాలి. ఇది కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ స్థాయిలను తగ్గేలా చేయడంతోపాటు శరీరాన్ని రిలాక్సేషన్ గా చేస్తుంది. అప్పుడప్పుడు దీర్ఘశ్యాసను తీసుకుని వదులుతుండాలి.

ఎసెన్షియల్ ఆయల్.. తులసి, పెప్పర్ మింట్, యూకలిప్టస్ నూనెలను నుదురు, కణతులకు నెమ్మదిగా మర్ధనా చేయాలి. దీంతో ఉద్యేగాన్ని అదుపు చేయవచ్చు.

Also Read: Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..

Director Koratala Siva: నిర్మాతగా మారిన స్టార్ డైరెక్టర్.. సత్యదేవ్ హీరోగా కొరటాల సినిమా