AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Koratala Siva: నిర్మాతగా మారిన స్టార్ డైరెక్టర్.. సత్యదేవ్ హీరోగా కొరటాల సినిమా

ఆచార్య కొరటాల శివ.. ఓ టాలీవుడ్ అప్‌కమింగ్ క్రేజీ హీరోకు బర్త్‌ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే వర్సటైల్ యాక్టింగ్తో... వేరియస్‌ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లొ నటించిన ఆ హీరోను..

Director Koratala Siva: నిర్మాతగా మారిన స్టార్ డైరెక్టర్.. సత్యదేవ్ హీరోగా కొరటాల సినిమా
Koratala
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2021 | 4:28 PM

Share

Director Koratala Siva: ఆచార్య కొరటాల శివ.. ఓ టాలీవుడ్ అప్‌కమింగ్ క్రేజీ హీరోకు బర్త్‌ డే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటికే వర్సటైల్ యాక్టింగ్తో… వేరియస్‌ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్లొ నటించిన ఆ హీరోను..నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకుపోనున్నారు. అతడి కెరీర్‌లో వన్‌ ఆఫ్ ది బిగ్‌ హిట్‌ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా వింటుంటే… కొరటాల ఆ హీరోతో సినిమా చేస్తున్నారని అనుకునేరు.. తీస్తున్నారు..! అవును టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లందరి లాగే… కొరటాల శివ కూడా రెండు పడవల్లో ప్రయాణించనున్నారు. ఓపక్క సినిమాలను డైరెక్ట్‌ చేస్తూనే… మరో పక్క సినిమాలను నిర్మించనున్నారు. కాన్పెప్ట్‌ ఓరియెంటెడ్… కంటెట్ బేస్ట్ సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. అందుకోసం వర్సటైల్ యాక్టర్‌ సత్య దేవ్‌ ను సెలక్ట్ చేసుకున్నారు. అతడితో ఓ క్రేజీ సినిమాకు ముహూర్తం కూడా పెట్టేశారు. ఈ స్టార్‌ డైరెక్టర్‌.

సత్యదేవ్ హీరోగా వివి గోపాల కృష్ణ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమాను నిర్మిస్తున్నారు కొరటాల. విజయవాడ బ్యాక్ డ్రాప్ కథలో రూపొందబోతున్న ఈ సినిమా లో సత్యదేవ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇక కథ బాగా నచ్చడంతో ఈ సినిమాను నిర్మించేందుకు కొరటాల ముందుకు వచ్చారని… సినిమా తీసేందుకు నిర్ణయించుకున్నారనే టాక్‌ ఉంది. ఇక సత్యదేవ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ సినిమాను అనౌన్స్మెంట్ లుక్‌ను రిలీజ్‌ చేశారు ఈ మూవీ మేకర్స్‌. ఈ లుక్‌లో సత్యదేవ్ ఫెరోషియస్గా… ఎలిగెంట్ గా కనిపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. కష్ట పడి ఫైట్‌ చేసి మరీ.. కసిగా రైటర్‌ టూ డైరెక్టర్‌ గా ఎదిగారు కొరటాల శివ. రోహిత్.. గర్ల్‌ ఫ్రెండ్‌ సినిమా టూ ఎన్టీఆర్‌ ఊసరవెళ్లి వరకు రైటర్ గా పనిచేసిన కొరటాల ఆ తరువాత మిర్చి సినిమాతో డైరెక్టర్‌ గా పరిచయమై.. ఇప్పుడు ఇండస్ట్రీలో వన్‌ ఆఫ్ ద టాప్‌ డైరెక్టర్‌ గా దూసుకుపోతున్నారు దూసుకుపోవడమే కాదు… ప్రొడ్యూసర్‌గా మరాబోతున్నారు. సినిమాలు నిర్మించబోతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dimple Hayathi: బాలీవుడ్‏లోకి డింపుల్ హయాతి ?… వరుస ఆఫర్లతో ‘ఖిలాడి’ హీరోయిన్ బిజీ..

Mehreen Pirzada : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లు డిలీట్ చేసిన మెహరీన్.. అమ్మడి బ్రేకప్ కు కారణం అదేనా..