Dimple Hayathi: బాలీవుడ్‏లోకి డింపుల్ హయాతి ?… వరుస ఆఫర్లతో ‘ఖిలాడి’ హీరోయిన్ బిజీ..

"గల్ఫ్" సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. ఆ తర్వాత ప్రభుదేవా సరసన "అభినేత్రి 2" లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.

Dimple Hayathi: బాలీవుడ్‏లోకి డింపుల్ హయాతి ?... వరుస ఆఫర్లతో  'ఖిలాడి' హీరోయిన్ బిజీ..
Dimple Hayathi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 04, 2021 | 3:53 PM

“గల్ఫ్” సినిమాతో వెండితెరకు పరిచయమైన డింపుల్ హయాతి.. ఆ తర్వాత ప్రభుదేవా సరసన “అభినేత్రి 2” లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇవే కాకుండా.. టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన “గద్దలకొండ గణేష్” సినిమాలో స్పెషల్ సాంగ్‏‏లో స్టెప్పులేసింది ఈ హైదరాబాద్ బ్యూటీ.. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న “ఖిలాడి” చిత్రంలో హీరోయిన్‏గా నటిస్తుంది. ఈ మూవీకి రమేష్ రావు దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ డ్యూయల్ రోల్‏లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా డింపుల్ హయాతికి బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ శంకర్ హిందీలో తెరకెక్కిస్తున్న “అపరిచితుడు” రీమేక్‏లో డింపుల్ హయాతి ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను పెన్ స్టూడియోస్ నిర్మిస్తుండగా.. రణ్‏వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఇదే కాకుండా.. యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ నటించబోతున్న మరో సినిమాలో కూడా డింపుల్ హయాతి హీరోయిన్‏గా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుత ఈ బ్యూటీ నటిస్తున్న “ఖిలాడి” చిత్రం.. 90 శాతం వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇందులో ముఖేశ్ రుషి, సచిన్ కేద్కర్, రావు రమేష్.. మురళీ శర్మ కీలకపాత్రలలో కనిపించనున్నారు. అలాగే మరో ముఖ్యమైన పాత్రలో పాపులర్ యాంకర్ అనసూయ నటిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read: Mehreen Pirzada : ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ లు డిలీట్ చేసిన మెహరీన్.. అమ్మడి బ్రేకప్ కు కారణం అదేనా..

Sudeer Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో చర్చ… సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుపై హీరో సుధీర్ బాబు ట్వీట్..

Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే…

Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్… వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!