AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే…

వనితా విజయ్ కుమార్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా.. వనితా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో

Vanitha Vijay Kumar: సీనియర్ హీరోయిన్ పై విరుచుకుపడ్డ వివాదాల వనితా.. ఈసారి ఏమన్నదంటే...
Vanitha Vijay Kumar
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 2:51 PM

Share

వనితా విజయ్ కుమార్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా.. వనితా.. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వనితా విజయ్ కుమార్ పెళ్లిళ్లకు సంబంధించిన రూమర్స్ నిత్యం నెట్టింట్లో హల్‏చల్ చేస్తుంటాయి. ఇక వాటిపై వనితా కూడా తన స్టైల్లో స్ట్రాంగ్ ఆన్సర్స్ ఇస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి నెట్టింట్లో మరో వివాదాన్ని తీసుకువచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం వనితా విజయ్ కుమార్.. బీబీ జోడిగల్ అనే తమిళ షాలో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఆ షో నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లుగా ప్రకటించి అందరికి షాకిచ్చింది. ఈ క్రమంలోనే మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటునే.. ఓ సీనియర్ నటి వల్లనే తాను షో నుంచి తప్పుకుంటున్నట్లుగా ట్వీట్ చేశారు.

“సాధారణంగా మహిళల్లో ఎక్కువగా అసూయ ఉంటుంది. అయితే పనిచేసే చోట ఎక్కువగా మగవారి వేధింపులు ఎదురువుతుంటాయని తెలుసు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అని ప్రతి రంగంలో ఉంటాయి. ముఖ్యంగా అధికారం కోసం మహిళలు ఏమైనా చేస్తుంటారు. ఒక స్త్రీ.. మరో స్త్రీకి సాయం చేయాలి. కొత్త వారికి సపోర్ట్ ఇవ్వాలి. కానీ వారితోనే పోటి పడేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి జీవిత ప్రయాణం ఎక్కడికి చేరుకోవాలనే విషయం మరచిపోతుంటారు ” అంటూ వనితా విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. తనకు అవకాశం ఇచ్చిన విజయ్ టెలివిజన్ కు ధన్యవాదాలు చెప్పారు వనితా.. అలాగే.. ఓ సీనియర్ నటి కారణంగానే తాను ఈ షో నుంచి అర్ధాంతరంగా తప్పుకుంటున్నానని… కానీ ఛానెల్ పట్ల తనకు గౌరవం, కృతజ్ఞతాభావం అలాగే ఉంటుందని పేర్కోంది.

ట్వీట్..

అయితే వనితా విజయ్ కుమార్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు కోలీవుడ్‏లో మరో రచ్చకు దారితీసాయి. ఆమె చేస్తున్న షోలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ హోస్ట్‏గా వ్యహరిస్తోంది. అందులో ఆమెనే సీనియర్ నటి కూడా. అయితే వనితా ఆమెను ఉద్దేశించే ట్వీట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయమై ఓ ప్రముఖ ఛానెల్ నటి రమ్యకృష్ణను ప్రశ్నించగా… “షోలో ఏం జరిగిందో కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది. నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు.. నో కామెంట్స్” అంటూ సింపుల్‏గా ఆన్సర్ ఇచ్చేసింది.

Also Read: Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్… వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు

Saroj Khan: బాలీవుడ్‏లో బయోపిక్‏ల హంగామా.. తెరపైకి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ జీవితకథ..

Follow Us
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఫిఫాలో ఈ వింత ఆచారాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..?
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..
ఇంత ఓపిక ఎలా ఉందిరా నాయనా.. ఒకే కుటుంబంలో 200 మంది..