AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్… వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు తో విడిపోతున్నారన్న వార్త సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా అమీర్ ఖాన్ ప్రకటించారు.

Aamir Khan-Kiran Rao : అమీర్ విడాకుల పై ఆర్జీవీ ట్వీట్... వర్మ సినిమాకు స్టోరీ దొరికిందంటున్న నెటిజన్లు
Rgv
Rajeev Rayala
|

Updated on: Jul 04, 2021 | 2:47 PM

Share

Aamir Khan-Kiran Rao : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావు తో విడిపోతున్నారన్న వార్త సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా అమీర్ ఖాన్ ప్రకటించారు. దీంతో అమీర్, కిరణ్ రావుల 15 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరపడినట్లైంది. ఈ 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో అద్భుతమైన అనుభవాలు, సంతోషాన్ని, ఆనందాన్ని తాము పంచుకోవడం జరిగిందని అమీర్, కిరణ్ లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ కూడా జరుగుతుంది. ఈ విషయం పై వివాదాల దర్శకుడు వర్మ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

అమీర్ ఖాన్ – కిరణ్  ఎలాంటి బాధ లేకుండా విడిపోతున్నార‌ని, వారికి లేని బాధ ఈ ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ల‌కి ఎందుక‌ని  వర్మ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వాళ్లను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని నిలదీశారు. అమీర్ ఖాన్ , కిర‌ణ్ రావ్ విడిపోవ‌డంతో భవిష్యత్తులో వారు వ్యక్తిగత జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉంటారని అనుకుంటున్నానని ఆయ‌న చెప్పారు. ఎన్న‌డూలేని విధంగా ఇక‌పై వారి జీవితాలు మరింత బాగుండాల‌ని ఆశిస్తున్నాన‌ని రామ్ గోపాల్ వ‌ర్మ చెప్పారు. త‌న‌ దృష్టిలో వివాహం చేసుకోవ‌డం కంటే విడాకులు తీసుకున్న‌ప్పేడ అధికంగా సెలబ్రేట్‌ చేసుకోవాలని ఆయ‌న అన్నారు. ఎందుకంటే వివాహం అనేది మూర్ఖత్వమ‌ని, అది అజ్ఞానం అని అన్నారు. విడాకులు అనేది మాత్రం జ్ఞానం, తెలివితో కూడినదని చెప్పుకొచ్చారు. వర్మ ట్వీట్ పైన కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు . వర్మకు మరో సినిమా స్టోరీ దొరికిందని, అమీర్ ఖాన్ బయోపిక్ కూడా చేస్తాడని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sekhar Kammula: మొదటిసారి ఇద్దరు హీరోలను హ్యాండిల్‌ చేయనున్న సెన్సిబుల్‌ డైరెక్టర్‌..? ఆ సినిమాలో ధనుష్‌తో పాటు.

Satyadev Timmarusu: సత్యదేవ్ బర్త్ డే కానుక.. ఆకట్టుకుంటున్న తిమ్మరుసు మూవీ గ్లిమ్స్

Vantalakka Premi: దేవికగా బుల్లి తెరపై సందడి చేయనున్న వంటలక్క మోడ్రన్ లుక్ స్టైలిష్ గా అదిరిందిగా