Vantalakka Premi: దేవికగా బుల్లి తెరపై సందడి చేయనున్న వంటలక్క మోడ్రన్ లుక్ స్టైలిష్ గా అదిరిందిగా
Vantalakka : ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ కరతముత్తులో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఈ సీరియల్ 2013 లో..
Vantalakka : ఫోటో గ్రాఫర్ గా పనిచేస్తున్న సమయంలో మలయాళంలో సూపర్ హిట్ సీరియల్ కరతముత్తులో నటించే అవకాశం దక్కించుకుంది ప్రేమి విశ్వనాథన్. ఈ సీరియల్ 2013 లో మలయాళ టీవిరంగంలో సంచలనాన్ని సృష్టించి, ప్రేమి నటనకి మంచిపేరు తెచ్చింది. ఈ సీరియల్‌లో ప్రేమి విశ్వనాథ్ నటనకు గాను ఆమెకు ఉత్తమ మహిళా నటి (2014) ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. మలయాళంలో ఈ సూపర్ హిట్ సీరియల్ మూడేళ్ళ న్నర ఏళ్ల క్రితం తెలుగులో కార్తీక దీపంగా అడుగు పెట్టింది. ఇక్కడ కూడా వంటలక్కగా ఈ సీరియల్ టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. సీరియల్స్ అంటే ఆడవారే చూస్తారు అన్న మాటను చెరిపేసి.. మగవాళ్లకు కూడా తన అభిమానులుగా చేసుకుంది. సుమారు 1082 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్ఫీ రేటింగ్ తో దూసుకుపోతుంది. దీనికి ఈ సీరియల్ లోని ప్రధాన పాత్రలు అయితే ప్రధాన కారణం మాత్రం ఖచ్చితంగా ప్రేమి విశ్వనాధ్ అని చెప్పవచ్చు.
దేశ విదేశాల్లో ఈ సీరియల్ కు ముఖ్యంగా దీపకు ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వంటలక్కగా అంత ఫేమ్ సంపాదించుకుంది కేరళ కుట్టి ప్రేమి విశ్వనాథన్. తెలుగు ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కరికీ దీప గురించి తెలుసు. దీప తర్వాత మరో రెండు సీరియల్స్ లో, రెండు తమిళ చిత్రాల్లో నటించింది. తెలుగు ప్రేక్షకులకు చేరువై రికార్డులను సృష్టిస్తున్న వంటలక్క తెలుగులో మరే సీరియల్ లోనూ నటించడలేదు. అయితే చాలా కాలం తరువాత ఈ కేరళ ముద్దుగుమ్మ మరో సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.
మలయాళంలో దేవిక పేరుతో ఈ సీరియల్ ప్రసారం కానుంది. జూలై 5 నుంచి సూర్య టీవీలో రాత్రి 8 గంటలకు ఈ సీరియల్ ప్రసారంకానుంది. ఇదే విషయాని అభిమానులతో సోషల్ మీడియా వేదికగా తెలిపింది వంటలక్క. దేవిక సీరియల్ ప్రోమోని తన ఫేస్ బుక్ లో షేర్ చేసింది. ఐతే తెలుగులో కట్టుబొట్టు తో సంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దు గుమ్మ.. దేవిక సీరియల్ లో మోడ్రన్ లుక్ లో మోడ్రన్ డ్రెస్ ల్లో స్టైలిష్ గా కనిపించనున్నట్లు ప్రోమో చూసినవారికి తెలుస్తోంది.
వంటలక్కకి తెలుగు రాష్ట్రాలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో తెలుగు ప్రేక్షకులు భాష తో పనిలేదంటూ వంటలక్క దేవిక సీరియల్ ను తెలుగు ప్రేక్షకులు చుసేటట్లు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: ఆయుర్వేదంలో అద్భుత ఔషది ఈ ఆకు.. జ్ఞాపక శక్తితో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఆకుని ట్రై చేయండి..