AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kasthuri Shankar: సోషల్ మీడియాలో ‘గృహలక్ష్మీ’ నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..

నటి కస్తూరి శంకర్.. 'గృహలక్ష్మీ' సిరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అయితే నటి కస్తూరి అటు సిరియల్ పరంగానే కాకుండా.. సోషల్ మీడియాలోనూ

Kasthuri Shankar: సోషల్ మీడియాలో 'గృహలక్ష్మీ' నటి మరో రచ్చ.. ఏకంగా ముఖ్యమంత్రిపైనే షాకింగ్ కామెంట్స్..
Kasturi Shankar
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2021 | 8:00 AM

Share

నటి కస్తూరి శంకర్.. ‘గృహలక్ష్మీ’ సిరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. అయితే నటి కస్తూరి అటు సిరియల్ పరంగానే కాకుండా.. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక అంశాలు.. రాజకీయ విషయాలపై కామెంట్స్ చేస్తూ.. వివాదాలకు దారితీస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు కస్తూరి శంకర్ వేసే ప్రశ్నలు.. విశ్లేషణలు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇటీవల రజినీ కాంత్ అమెరికా టూర్ పై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది కస్తూరీ. ఇక్కడ హాస్పిటల్స్ లేవా ? అమెరికాకు ఇండియన్స్ రావడానికి అనుమతి లేదు.. కానీ రజినీ ఎలా వెళ్లారంటూ ప్రశ్నించింది. రజినీ కాంత్ ప్రవర్తన పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది కస్తూరీ. తాజాగా ఈమె ఇప్పుడు మరో రచ్చకు తెరలెపినట్లుగా తెలుస్తోంది.

కస్తూరి శంకర్ తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీఎం స్టాలిన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఉదయం పూట సైకిల్ తొక్కుతూ.. ప్రజల వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు.. సీఎంపై ప్రశంసలు కురిపించారు. అయితే నటి కస్తూరి కూడా సీఎం స్టాలిన్ చేస్తున్న పనిని సమర్ధించారు. మరోవైపు స్టాలిన్ కు చురలు వేశారు. ” MK స్టాలిన్ ఒక రాక్ స్టార్, స్వాగ్ సీఎం, కానీ సీఎం సర్ ప్రజలలోకి ఇలా వచ్చినప్పుడు మాస్క్ ధరించండి. మీ ఫోటోలతో మాస్క్ పై అవగాహన కల్పించండి” అంటూ చురకలు అంటించారు. ప్రస్తుతం కస్తూరి ట్వీట్ వైరల్ గా మారింది.

ట్వీట్..

Also Read: Antony Eastman: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సిల్క్ స్మితను పరిచయం చేసిన డైరెక్టర్ ఇకలేడు..

Shahid Kapoor: తెరపైకి మరోసారి విద్యాబాలన్-షాహిద్ కపూర్ లవ్‏స్టోరీ.. ఆ కామెంట్స్ వల్లే విడిపోయారంటూ..

Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్‏లో చందమామ..