Antony Eastman: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సిల్క్ స్మితను పరిచయం చేసిన డైరెక్టర్ ఇకలేరు..
ప్రముఖ డైరెక్టర్ కమ్ నిర్మాత కమ్ డైరెక్టర్ ఆంథోని ఈస్ట్‌మన్ (75) గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఆయన త్రిస్సూర్ లోని మెడికల్ కాలేజీ కమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుముశారు.
ప్రముఖ డైరెక్టర్ కమ్ నిర్మాత కమ్ డైరెక్టర్ ఆంథోని ఈస్ట్‌మన్ (75) గుండెపోటుతో మరణించారు. ఆదివారం ఆయన త్రిస్సూర్ లోని మెడికల్ కాలేజీ కమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుముశారు. ఆంథోని మరణవార్త విని.. మలయాళ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆంథోనికి “ఈస్ట్‌మన్” అనే స్టూడియో ఉంది. దీంతో క్రమంగా ఆయనను ఆంథోని ఈస్ట్‌మన్ అని పిలిచేవారు.
ఆ తర్వత ఆంథోని దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఆయన తొలి చిత్రం ఇనాయే తేడి. ఈ మూవీ తర్వాత అంబాడే న్జానే, ఐస్ క్రీమ్, మృదుల, వయల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. టాలీవుడ్ సీనియర్ నటి సిల్క్ స్మితను వెండితెరకు పరిచయం చేసింది కూడా ఆంథోనినే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జాన్సన్ కూడా పరిచయం చేసింది ఈ ఇతనే. కేవలం దర్శకుడిగానే కాకుండా.. నిర్మాతగా, ఫోటో గ్రాఫర్ గా ఆంథోనీ పనిచేశాడు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆంథోని మాట్లాడుతూ.. “హీరోయిన్ కోసం వెతుకుతూ.. చాలా రోజులు వెయిట్ చేశామని.. అలా కోడంబక్కంలోని కొందరు యువతులు మేకప్ వేసుకోని ఆడిషన్స్ కు వచ్చారు. అయితే అక్కడే ఒకచోట ఒక మహిళ పనిమనిషిలా కూర్చోని ఉంది. ఆమెను వాళ్ల అమ్మగారి అనుమతి తీసుకుని మేకప్ లేకుండా ఫోటోలు తీసుకున్నాను. ఆ తర్వాత కొందరు డైరెక్టర్స్ కు చూపించగా.. అందురూ ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. అయితే ముందు ఆమె విజయమాల. కానీ సినిమాల కోసం వేరే పేరు పెడుతామని చెప్పాగానే ఆమె ఒప్పుకుంది. అప్పట్లో స్మిత పాటిల్ పాపులర్ గా నటిస్తున్న సమయం అది. ఆ పేరు మీద ఆకర్షణ ఎక్కువ ఉన్నందున ఆమెకు స్మిత అని పేరు పెట్టాము. అలాగే ఆమె నటించిన సిల్క్ సినిమా పేరు కూడా ఆమె పేరు జత చేశారు. కమల్ హాసన్ నటించిన థర్డ్ క్రెసెంట్ మూవీ సిల్క్ స్మిత జీవితాన్ని మార్చేసింది” అంటూ చెప్పారు.
Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్లో చందమామ..