Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్‏లో చందమామ..

Kajal Aggarwal:  ప్రస్తుతం అక్కినేని నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న

Kajal Aggarwal: నాగార్జున సినిమాలో కాజల్ పాత్ర అలా ఉండబోతుందా ? ఛాలెంజింగ్ రోల్‏లో చందమామ..
Kajal Aggarwal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2021 | 6:33 AM

Kajal Aggarwal:  ప్రస్తుతం అక్కినేని నాగార్జున డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీని నారాయణ దాస్, నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలోనే రెండు షెడ్యూల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో నాగ్ సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ఈ మూవీలో నాగార్జున ఎక్స్ రా ఏజెంట్ పాత్రలో కనిపించపోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు… ఇందులో కాజల్ పాత్ర కూడా హీరో నాగార్జున పాత్రకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందట.

అయితే కాజల్ కూడా రా ఏజెంట్ పాత్రలోనే నటిస్తుందంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉగ్రవాదుల మధ్యలో ఉంటూ.. వారి సమాచారాన్ని ఇండియాకు చేరవేసే పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపించింది. యాక్షన్ సన్నివేశాలతోపాటు.. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా కాజల్ నటించాల్సిందేనట. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో కాజల్ రా ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా… అక్కడ ఆమె ఒక వేశ్యగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉంటూ.. వారి సమాచారాన్ని ఇండియన్ ఆర్మీకి చేరవేస్తూ.. ఆర్మీకి సహకరించే డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ పాత్ర కోసం కాజల్ ఫిజికల్ పరంగా ఈ సినిమాతో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది.

Also Read: Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్.. వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..

Aamir Khan: ఫుల్ ఖుషిగా అమీర్ దంపతులు.. కిరణ్ రావుతో కలిసి వీడియో షేర్ చేసిన మిస్టర్ ఫర్ఫెక్ట్.. మండిపడుతున్న నెటిజన్స్..

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..