AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్.. వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా.. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల మార్చి 13న హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది.

Bhavya Bishnoi: పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న హీరోయిన్.. కారణమదేనంటూ నెటిజన్ల ట్రోల్..  వార్నింగ్ ఇచ్చిన భవ్య బిష్ణోయ్..
Mehreen
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 9:36 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా.. తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత నెల మార్చి 13న హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకను జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. అయితే కారణాలు తెలియవు కానీ.. భవ్యతో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నాని చెప్పి అందరికి షాకిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక నుంచి తనతో.. అతడి కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధం ఉండదని పోస్ట్ చేసింది. అందుకు గల కారణాలను మాత్రం మెహ్రీన్ వెల్లడించలేదు. దీంతో.. సోషల్ మీడియాలో భవ్య బిష్ణోయ్.. అతడి కుటుంబం పై వ్యతిరేకంగా కొందరు కామెంట్స్ చేయడం ప్రారంభించారు. ఎదో పెద్ద కారణం ఉందని.. అందుకే మెహ్రీన్ బ్రేకప్ చెప్పిందని.. భవ్యతోపాటు అతడి కుటుంబ సభ్యులను నిందిస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తాజాగా తన పై వస్తున్న వార్తలపై భవ్య స్పందిస్తూ.. తన పై కానీ.. తన కుటుంబంపై కానీ ఆరోపణలు చేస్తున్నవారికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికంగా సుదీర్ఘ పోస్ట్ చేశారు భవ్య. “పెళ్లి రద్దు అయ్యిందనే విషయంపై వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. అలా అని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నాపై, నా కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారు. ఇంతటితో అవి ఆపేయండి. తప్పుడు వార్తలు, కామెంట్స్ చేసే వారి అకౌంట్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ” అంటూ హెచ్చరించాడు.

ట్వీట్..

ఇదిలా ఉంటే.. వీరిద్దరు విడిపోవడానికి కారణం మిస్ అండర్ స్టాండింగే అని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. గత కొన్ని రోజులుగా వారిద్దరి సినిమాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని.. అందుకే వారు విడిపోయారని టాక్ బలంగా వినిపిస్తోంది. తాజాగా వారిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నింటిని సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి కంప్లీట్‌గా డిలీట్ చేశారు మెహ్రీన్.