ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి… షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..

ఆ దర్శకుడికి కోరుకున్నది ఇస్తే లక్ష రూపాయాలిస్తారట.. వెంటనే బిల్డింగ్ మీద నుంచి... షాకింగ్ విషయాలను చెప్పిన హీరోయిన్..
Swetha Varma

Swetha Varma: సీని పరిశ్రమలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోంటున్నారన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో రాణించాలనుకునే మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని ఇప్పటికే

Rajitha Chanti

|

Jul 04, 2021 | 7:19 PM

Swetha Varma: సీని పరిశ్రమలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోంటున్నారన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో రాణించాలనుకునే మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని ఇప్పటికే చాలా మంది తారలు బహిరంగంగా మాట్లాడారు. అంతేకాదు.. ప్రతి పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉంటుందని.. కేవలం కొందరు మాత్రమే వాటిని స్రాంగ్‏గా ఎదుర్కోంటారని తెలిపారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు తమకు ఎదురైన చెదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాల గురించి గతంలో మీటూ పేరుతో ఉద్యమం జరిగింది. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా భాషతో సంబంధం లేకుండా.. ప్రతి ఇండస్ట్రీలలోని మహిళలను వేధింపులు ఎదుర్కోంటున్నారు. తాజాగా పచ్చీస్, సైకిల్ వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్వేత వర్మ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ సోషల్ మీడియా వేదికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తన జీవితంలో జరిగిన చెదు అనుభవం గురించి చెప్పుకోచ్చారు.

“నేను షార్ట్ ఫిల్మ్ చేస్తున్న సమయంలో కొందరు కమిట్‏మెంట్ ఇవ్వాలని అడిగారు. సినిమా గురించి అడుగుతున్నారేమో అనుకున్నా. కానీ వారి ఉద్ధేశ్యం నాకు తర్వాత అర్థమైంది. అందుకు సంబంధించిన స్క్రీన్ షార్ట్స్ నా దగ్గర ఉన్నాయి. 2015లో ఓ యాడ్ కోసం కొందరు నన్ను సంప్రదించారు. లక్ష రూపాయాలు ఇస్తాం… కానీ దర్శకుడు కోరుకున్నది చేయాలని చెప్పారు. వెంటనే అతను అలా అడిగే సరికి షాకయ్యా.. అతడిని బిల్డింగ్ పై నుంచి దూకమని చెప్పాను ” అంటూ చెప్పుకోచ్చింది శ్వేత వర్మ..

అయితే తాను ఇలా క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కోవడం మొదటి సారి ఏం కాదని.. చాలా సార్లు ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని.. కానీ అవన్ని సోషల్ మీడియా ద్వారా వచ్చాయని.. నేరుగా మాత్రం ఎలాంటి సమస్య రాలేదని తెలిపింది. ఇక తన టాలెంట్ తోనే తాను ఇక్కడి వరకు వచ్చానని.. ఇలాంటి పనులకు మధ్యవర్తిత్వం వహించేది వారి మేనేజర్లు మాత్రమే అని అన్నారు శ్వేత వర్మ.

Also Read: Heart Touching Video: భాగస్వామి చనిపోవడంతో గుండెలవిసేలా రోధించిన పక్షి.. అంతిమ వీడ్కోలు మీ గుండెను బరువెక్కిస్తుంది

Viral Video: బాప్ రే.. సింహం ఇలా కూడా వేటాడుతుందా.. షాకింగ్ వీడియో మీకోసం..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu