AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..

రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇటీవల తెలుగు సినిమాల్లో అంతగా కనిపించకపోయిన..

Rakul Preet Singh: రకుల్‏కు సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపిన బాలీవుడ్ హీరో.. కానుకను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరోయిన్..
Rakul Preet Singh
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2021 | 4:50 PM

Share

రకుల్ ప్రీత్ సింగ్.. తక్కువ కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇటీవల తెలుగు సినిమాల్లో అంతగా కనిపించకపోయిన.. బాలీవుడ్‏లో మాత్రం తెగ ఆఫర్లను అందుకుంటుంది ఈ బ్యూటీ. అయితే ఇటీవల తెలుగు పరిశ్రమకు రకుల్ దూరమవుతున్నట్లుగా వచ్చిన వార్తలపై సీరియస్ గానే స్పందించింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తనకు తెలుగు, హిందీ, తమిళ ఇండస్ట్రీలలో అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్నానని… ఇప్పుడు అవన్ని షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పుకోచ్చింది. అయితే తాజాగా రకుల్‏కు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సర్‏ఫ్రైజ్ గిఫ్ట్ పంపించాడు. ఆ కానుకను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అక్షయ్ కు కృతజ్ఞతలు చెప్పింది రకుల్.

ప్రస్తుతం కరోనా కేసులు కాస్తా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది మాత్రం కోవిడ్ టెస్టులు నిర్వహించిన రెండు మూడు రోజుల తర్వాత ఫలితం వచ్చేది. కానీ ఇప్పుడు కరోనా టెస్టింగ్ కిట్స్‏తో సొంతంగానే కోవిడ్ నియంత్రణ పరీక్షలు చేసుకోవచ్చు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన స్టాఫ్ తోపాటు.. ఇండస్ట్రీలోని చాలా మందికి ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను కానుకగా అందిస్తున్నాడు. మై ల్యాబ్ వారి కోవిసెల్ఫ్ కిట్ ను అక్షయ్ కుమార్ పలువురికి అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్ పంపించాడు. ఇక తనకు పంపిన కిట్ ను చూపిస్తూ.. రకుల్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.

Rakul

Rakul

Also Read: Director Koratala Siva: నిర్మాతగా మారిన స్టార్ డైరెక్టర్.. సత్యదేవ్ హీరోగా కొరటాల సినిమా

Wimbledon 2021: షూస్ మర్చిపోయి కోర్టులోకి ఎంటరైన ఆస్ట్రేలియా ప్లేయర్.. స్పెషల్ డెలివరీ అంటూ నెటిజన్ల చమత్కారం..!

Sajjala Ramakrishna Reddy: “ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం”

Free Milk: ఆవు పాలు ఉచితం.. అడిగితే ఆవును కూడా ఉచితంగా ఇచ్చేస్తారు.. ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే..