AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala Ramakrishna Reddy: “ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం”

జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు.

Sajjala Ramakrishna Reddy: ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం.. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం
Sajjala Ramakrishna Reddy
Ram Naramaneni
|

Updated on: Jul 04, 2021 | 4:08 PM

Share

జల వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలు మాట్లాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వాటా కింద దక్కిన నీటిలో ఒక్క చుక్కను కూడా వదులుకోమని సజ్జల స్పష్టం చేశారు. జలవివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని వివరించారు. జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతామని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామని చెప్పుకొచ్చారు. రెచ్చగొడితే రెచ్చిపోం, సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు.

నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేసుకోండి: ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి

తెలుగు రాష్టాల సీఎంలకు ఒకరిపై మరొకరికి అభిమానం ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలకు నీరిచ్చి ఆదుకోవాలనే తపన తెలంగాణ సీఎంకు ఉందని… గతంలో తిరుమలకు వచ్చిన కేసీఆర్ వ్యాఖ్యానించారని నారాయణస్వామి తెలిపారు. తెలుగు ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం వద్దని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నీరు పుష్కలంగా ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేయడం సరైన పద్ధతి కాదన్నారు.

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌

కృష్ణాజలాల అంశంపై తెలంగాణ హైకోర్టులో ఏపీ రైతు పిటిషన్‌ దాఖలు చేశారు.   హైకోర్టులో కృష్ణా జిల్లా రైతు హౌస్‌మోషన్‌ పిటిషన్‌ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘిస్తోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. జూన్‌ 28న తెలంగాణ జారీ చేసిన జీవోను సస్పెండ్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీరు వదలటం వల్ల ఏపీకి నష్టం కలుగుతోందని పిటిషన్​లో ప్రస్తావించారు.

Also Read: మాజీ భార్యే సవతి తల్లి అయిందని తెలిసి అతడి దిమ్మతిరిగిపోయిందిTV9 Telugu – Water I

సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఆదివారం చేప‌ల మార్కెట్ల వ‌ద్ద ఏందీ లొల్లి